మెగాస్టార్ చిరంజీవి పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. అందులో మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భోళా శంకర్’ ఒకటి. 2022లో విడుదల కానున్న ప్రధాన చిత్రాలలో ఈ ప్రాజెక్ట్ ఒకటి. ప్రస్తుతానికి ఈ చిత్రం ఒక ముఖ్యమైన షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. న్యూఇయర్ సందర్భంగా ‘స్వాగ్ ఆఫ్ బోలా’ అంటూ మేకర్స్ మెగా మాస్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ప్రీ లుక్ పోస్టర్లో చిరంజీవి తన ముఖాన్ని చేతితో కప్పుకున్నట్లు కనిపిస్తోంది. ఆయన చేతికి పవిత్రమైన దారాలను మనం చూడవచ్చు. మెగాస్టార్ స్టైలిష్ హెయిర్‌డోతో పోస్టర్లో కనువిందు చేశాడు. చిరంజీవి ఇందులో ‘భోళా’గా కనిపించబోతున్నాడు. న్యూఇయర్ కానుకగా మేకర్స్ ఈ చిన్న ప్రోమోను విడుదల చేసి మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు.
Read Also : పాన్ ఇండియా సినిమాలకు దెబ్బ మీద దెబ్బ !
మోషన్ పోస్టర్ విషయానికి వస్తే మహతి స్వర సాగర్ తన అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో చిరంజీవికి మెగా ఎలివేషన్ ఇచ్చారు. ఈ యువ కంపోజర్ తన ట్రాక్స్, స్కోర్లతో అభిమానులను, మాస్‌ను ఆకట్టుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ ప్రోమో చూస్తేనే అర్థమవుతోంది. ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో తమన్నా చిరుతో రొమాన్స్ చేయనుంది. కీర్తి సురేష్ ఆయనకు సోదరిగా కనిపించబోతోంది.