Suspense Crime Thriller:
ప్రీతి సుందర్, భవ్యశ్రీ, హితేంద్ర, రాము ముఖ్య తారాగణంగా సురేష్ మాపుర్ దర్సకత్వంలో తెరకెక్కిన సూపర్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘స్పార్క్ 1.ఓ’. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్న ఈ క్రేజీ క్రైమ్ ఎంటర్టైనర్ ప్రచార చిత్రాన్ని ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్ విడుదల చేసి, చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. హితేంద్ర నటించి, నిర్మించిన ‘స్పార్క్ 1.ఓ’ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించిన శ్రీకాంత్. దర్శకుడు సురేష్ లో మంచి స్పార్క్ ఉందని ప్రశంసించారు. తమ అభ్యర్థనను మన్నించి ఈ మూవీ ట్రైలర్ లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్ కు కృతజ్ఞతలు తెలిపిన హితేంద్ర అండ్ టీమ్! అతి త్వరలోనే ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇద్దరు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ నడుమ సాగే వినూత్నమైన క్రైమ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి రమణ మాస్టర్ ఫైట్స్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు.