సూర్య నటించిన తాజా చిత్రం ‘రెట్రో’ (Retro), దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా. థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఎన్నో అంచనాలతో విడుదలైనప్పటి ఆశలని అడియాశలయ్యాయి. వింటేజ్ సూర్యని చూస్తాం అని అభిమానులు చాలా హోప్స్ పెట్టుకున్నప్పటికీ చివరికి నిరాశే మిగిలింది. అయితే ప్రజంట్ ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్నప్పటికి, తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ సినిమాను మరో ఫార్మాట్‌లో విడుదల చేసే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్లు వెల్లడించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కార్తీక్ మాట్లాడుతూ..
Also Read : Manchu Manoj : ‘ఆవేశం’ రీమేక్ చేయాలనుకున్న..
‘ ‘రెట్రో’ ఎక్స్టెండెడ్ వెర్షన్ కోసం ఓటీటీ ప్లాట్‌ఫారాలతో చర్చలు జరుగుతున్నాయి. నాలుగు నెలల తర్వాత దీన్ని వెబ్ సిరీస్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నా. ఇందులో కేవలం తొలగించిన సన్నివేశాలు మాత్రమే కాకుండా, బలమైన భావోద్వేగాలతో కూడిన అంశాలు కూడా ఉంటాయి. ప్రతి ఎపిసోడ్‌ను సుమారు 40 నిమిషాల నిడివితో ప్లాన్ చేస్తున్నాం. హాస్యం, ప్రేమ, యాక్షన్ ఇలా ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కో ఎలిమెంట్‌ను హైలైట్ చేయాలనుకుంటున్నా’ అని చెప్పారు. సినిమా మొత్తం 2 గంటల 48 నిమిషాల రన్‌టైమ్‌తో విడుదలై కొంతమంది ప్రేక్షకుల నుంచి నిడివిపై విమర్శలు ఎదుర్కొంది. అదే ఇప్పుడు ఈ ఎక్స్టెండెడ్ వెర్షన్ సిరీస్ రూపంలో వస్తే మరింత ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని ఇలా ప్లాన్ చేసి ఉంటారు.