Surya : స్టార్ హీరో సూర్య తన భార్య జ్యోతిక ఎంత అన్యోన్యంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇద్దరూ తరచూ ఆనందంగా గడుపుతుంటారు. సూర్య ప్రస్తుతం వెంకీ అట్లూరి సినిమాను స్టార్ట్ చేశాడు. త్వరలోనే ఆ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఈ క్రమంలోనే తన భార్య జ్యోతికతో మంచి వెకేషన్ కు వెళ్లిపోయాడు సూర్య. తూర్పు ఆఫ్రికాలోని సీషెల్స్‌కు వీరిద్దరు మాత్రమే వెళ్లారు. పిల్లలను ఇండియాలోనే విడిచి వీరిద్దరూ ఏకాంతంగా గడిపేందుకు వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడ సముద్రం, అడవులు ఇతర అందాలను ఆస్వాదిస్తూ గడిపేస్తోంది ఈ జంట.
Read Also : Bengaluru: చెత్త లారీలో మహిళ మృతదేహం..
దానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటోంది ఈ జంట. ఇవి చూసిన సూర్య ఫ్యాన్స్ తెగ వైరల్ చేసేస్తున్నారు. సూర్య తన భార్య జ్యోతికకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. అందుకే ఆమె కోసం ముంబైకు షిఫ్ట్ అయ్యాడు. జ్యోతిక తన కోసం ఎన్నో వదులుకుందని.. అందుకే ఆమె కోసం ఏం చేయడానికైనా తాను రెడీగానే ఉంటానని చెబుతుంటాడు సూర్య. మొన్న వచ్చిన రెంట్రో మూవీతో తమిళంలో మంచి హిట్ అందుకున్నాడు. తెలుగులో మాత్రం ప్లాప్ అయింది ఈ మూవీ. ప్రస్తుతం వెంకీ అట్లూరితో చేస్తున్న మూవీతో మంచి హిట్ కొట్టాలని చూస్తున్నాడు.
Read Also : Raghava Lawrence : నిన్ను కొట్టను.. వచ్చి కలువు.. అతనికి రాఘవ లారెన్స్ ఆఫర్..