Site icon NTV Telugu

SSMB29 : సర్ ప్రైజ్.. SSMB29 నుంచి సాంగ్ రిలీజ్

Ssmb

Ssmb

SSMB29 : సూపర్ స్టార్ మహేశ్ బాబు – దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ “గ్లోబ్ ట్రోటర్ నుంచి భారీ సర్‌ప్రైజ్ బయటకు వచ్చింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే మేకర్స్ ఓ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్ పేరు “గ్లోబ్ ట్రాటర్”. స్పెషల్ ఏంటంటే ఈ పాటను హీరోయిన్ శ్రుతి హాసన్ స్వయంగా పాడింది. ఆమె వాయిస్, లిరిక్స్, మ్యూజిక్ కలిపి ఈ సాంగ్‌కి కొత్త ఫీల్‌ను తెచ్చాయి. “సంచారి.. సంచారి..” అంటూ సాగే లైన్స్, హీరో పాత్రలోని స్పిరిట్‌ను, అతని జర్నీని హైలెట్ చేస్తున్నాయి.

Read Also : Akhanda -2 : అఖండ 2 రిలీజ్ డేట్ ఫిక్స్..

ఈ నెల 15న జరగబోయే గ్రాండ్ ఈవెంట్‌ కోసం అభిమానులు ఎదురుచూస్తున్న సమయంలో ఈ సడెన్ సాంగ్ రిలీజ్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ పాటను సినిమాకోసం చేశారా.. లేదంటే ప్రమోషన్ కోసం రూపొందించారా అన్నది తెలియదు. కానీ శ్రుతి హాసన్ పాడినందున, ఈ సాంగ్ సినిమాలోనే ఉండే అవకాశం ఎక్కువగా ఉందని అభిమానులు అంచనా వేస్తున్నారు. కానీ రాజమౌళి మూవీ నుంచి ఎలాంటి చడీ చప్పుడు లేకుండా ఇలా రిలీజ్ చేయడం షాకింగ్ అంటున్నారు ఫ్యాన్స్.

Read Also : Raviteja : ఏంటి.. రవితేజ రెమ్యనరేషన్ తీసుకోకుండా మూవీ చేస్తున్నాడా..?

Exit mobile version