Suriya: మరోసారి తన గొప్పమనసు చాటుకున్న స్టార్ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరోలు అంటే సినిమాల్లో మంచి చేసేవారు కాదు.. తమలను ప్రేమించే అభిమానులు కష్టాల్లో ఉంటే మేము అండగా ఉన్నామని వారికి ధైర్యం చెప్పేవారు.. అదృష్టం మన టాలీవుడ్ హీరోలందరూ అలాంటి ధైర్యాన్ని అభిమానులకు ఇస్తున్నారు. అభిమానులకు ఏమైనా కష్టం వచ్చినా.. వారికి అండగా ఉంటూ రియల్ హీరోలు అని అనిపించుకుంటున్నారు. ఇక కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. సూర్య రీల్ లోనే కాదు రియల్ గా కూడా గొప్ప హీరో.. ఆయన చేసే సేవా కార్యక్రమాలకు అంతే ఉండదు. చిన్న పిల్లలకు అగారం ఫౌండేషన్ ద్వారా చదువు చెప్పిస్తున్నాడు. ఇక స్వచ్ఛంద సంస్థలకు డొనేషన్లు సూర్య ఇవ్వడం తెలిసిందే.. ఇక తాజాగా సూర్య తన ఉదారతను చూపించాడు. తన అభిమాని రోడ్డుప్రమాదంలో మృతి చెందితే స్వయంగా ఆయనే వెళ్లి కుటుంబాన్ని ఓదార్చాడు. అనంతరం కుటుంబాకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. ఇటీవల సూర్య అభిమాని జగదీషన్ (27) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
ఇక ఈ విషయం తెలుసుకున్న సూర్య.. ఇటీవల వారి కుటుంబాన్ని పరమార్శించాడు. సూర్యను చూడగానే ఆ కుటుంబం భోరున విలపించింది. చిన్న వయస్సులోనే జగదీశ్ మృతితో ఆ కుటుంబం దిక్కులేనిదిగా మారిపోయింది. అయితే జగదీశ్ లేని లోటును తాను తీర్చలేనని కానీ వారి బరువు బాధ్యతలన్నిటిని మోస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వారి పిల్లల చదువుల దగ్గర నుంచి వైద్యం వరకు అన్ని సూర్య ఫౌండేషన్ తరుపున చేయిస్తానని మాట ఇచ్చినట్లు సమాచారం. దీంతో సూర్య గొప్ప మనసుకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అలాంటి మంచి వ్యక్తికి అభిమానులం అని చెప్పుకోవడానికి గర్వంగా ఉందని ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి మరీ చెప్తుండడం విశేషం.
Also Read
- Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
- Allu Arjun : అల్లు అర్జున్ తెలుగు డైరెక్టర్స్‌ను పట్టించుకోడా?
- Tamannaah Bhatia: 'రాగిణి 3' షూటింగ్ ప్రారంభం.. సెట్స్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా
- Palli Chattambi OTT: ఓటీటీలోకి టోవినో థామస్ పీరియడ్ యాక్షన్ డ్రామా... స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
తాజావార్తలు
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
-
Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
-
PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
Allu Arjun : అల్లు అర్జున్ తెలుగు డైరెక్టర్స్‌ను పట్టించుకోడా?
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్‌ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!