Karuppu : మే 14న ‘వీరభద్రుడు’కి లైన్ క్లియర్

Karuppu Veerabhadrudu

Karuppu Veerabhadrudu

సూర్య ‘వీరభద్రుడు’ కోసం దర్శకుడు ఆర్జే బాలాజీతో చేతులు కలిపారు. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించడం ద్వారా పేరును తెచ్చుకున్న నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ సినిమాకి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. తమిళం, తెలుగు, హిందీ పరిశ్రమలలో పాపులర్ కంటెంట్‌ను అందించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని స్కేల్, కంటెంట్ రెండింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రతిష్టాత్మకగా తెరకెక్కిస్తోంది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, సాంగ్స్ భారీ అంచనాలని సృష్టించాయి. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఇంద్రన్స్, నట్టి, స్వసిక, అనఘ మాయ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రానికి జికె విష్ణు సినిమాటోగ్రఫీ. 2026 మే 14న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.