కోలీవుడ్ స్టార్ హీరో, సౌత్ లో మంచి ఫేమ్ ఉన్న హీరో సూర్య ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ ‘కంగువా’ సినిమా చేస్తున్నాడు. శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ అనౌన్స్మెంట్ నుంచే సాలిడ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఆకాశాన్ని తాకే అంచనాల మధ్య ఇటీవలే కంగువా ఫస్ట్ లుక్ అండ్ గ్లిమ్ప్స్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. ఈ గ్లిమ్ప్స్ ని ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తమిళ్, తెలుగు అనే తేడా లేకుండా ఆల్ ఇండియన్ లాంగ్వేజస్ లో కంగువా గ్లిమ్ప్స్ లో సూపర్బ్ రెస్పాన్స్ రావడంతో, సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. ఇప్పటికే సాలిడ్ హైప్ ఉంది అనుకుంటే గ్లిమ్ప్స్, ఆ అంచనాలని మరింత పెంచింది. ఈ గ్లిమ్ప్స్ లో సూర్య లుక్ టెర్రిఫిక్ గా ఉంది.
గ్లిమ్ప్స్ రేంజులో కంగువా సినిమా మొత్తం ఉంటే కోలీవుడ్ ఖాతాలో మొదటి వెయ్యి కోట్ల సినిమా పడినట్లే అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం… కంగువా సినిమా మొత్తం ఈ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లోనే ఉండదట. ఆడియన్స్ కి గ్లిమ్ప్స్ లో చూపించిన పార్ట్ కొంత మాత్రమే ఉంటుందని, మిగిలిన పార్ట్ నార్మల్ గానే ఉంటుందని సమాచారం. గోవాలో ప్రస్తుతం జరిగే కథతో సగం కంగువా సినిమా సాగుతుందని సమాచారం. ఇదే నిజమైతే కంగువా సినిమా ఒక కొత్త ప్రపంచంలో ఉంటుందని నమ్ముతున్న ప్రతి సినీ అభిమాని నిరాశ చెందడం గ్యారెంటీ. అది కంగువా సినిమా కలెక్షన్స్ కి నష్టం కలిగించే అవకాశం ఉంది. మేకర్స్ ఇప్పటికైనా ఈ విషయం రియలైజ్ అయ్యి నెక్స్ట్ వదిలే ప్రమోషనల్ కంటెంట్ లో ప్రెజెంట్ లుక్ కి సంబంధించిన అప్డేట్ కూడా ఇస్తే బాగుంటుంది.
He is the one and only!
He is Kanguva 🔥Blast your speakers 🔊 to the theme of #GlimpseOfKanguva.
Available on your favorite streaming platforms in 6 languages! @Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @StudioGreen2 @kegvraja @UV_Creations @saregamasouth… pic.twitter.com/c33OOGp1mj— UV Creations (@UV_Creations) August 1, 2023
