Site icon NTV Telugu

Suriya : వరుస ప్లాపులు.. ప్రయోగాలకు దూరంగా సూర్య.. టాలీవుడ్ డైరెక్టర్ కు ఛాన్స్

Suriya

Suriya

ప్రయోగాల జోలికి వెళ్లొచ్చు కానీ.. ఏళ్ల తరబడి ఒకే సినిమాకు కమిటైపోయి ఒళ్లు హూనం చేసుకుని, చేతులు కాల్చుకోరాదు. ప్రయోగాలు చేయరాదు అని సూర్యకు కంగువాతో అర్థమైనట్టే ఉంది. అందుకే ఈ సారి పంథా మార్చి.. ఫ్యాన్స్‌ను ఖుషీ చేయడమే పనిగా పెట్టుకున్నాడు. అభిమానులతో టచ్ మిస్ కాకుండా ఉండేందుకు వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నాడు. అందులోనూ ఓన్ ఇలాకాలోస్టార్ దర్శకుల్ని పక్కన పెట్టి పొరుగు ఇండస్ట్రీ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్‌కు ఛాన్స్ ఇస్తున్నాడు.

Also Read : Biker : శర్వానంద్ ‘బైకర్’ రిలీజ్ వాయిదా.. కారణం ఏంటంటే?

మలయాళ మూవీ ఆవేశంతో పాపులరైన జీతూ మాధవన్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీని ప్లాన్ చేస్తున్నాడు రోలెక్స్. డిసెంబర్‌లో ఈ మూవీ పట్టాలెక్కబోతోంది. ఈ మూవీలో నజ్రియా నజీమ్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రేమలు ఫేం నస్లేన్ కీ రోల్ ప్లే చేస్తున్నట్లు టాక్‌. సూర్య ఇందులో పోలీసాఫీసర్ పాత్రలో నటించబోతున్నాడన్నది టాక్. కాగా, సూర్య మరో తెలుగు దర్శకుడితో కొలాబరేట్ కాబోతున్నాడన్నది లేటెస్ట్ టాక్. అంటే సుందరానికి, సరిపోదా శనివారం ఫేం వివేక్ ఆత్రేయ సూర్యకు కథ చెప్పి ఓకే చేయించుకున్నాడన్న టాక్‌ వినిపిస్తోంది. న్యూ మూవీ ప్రాజెక్ట్స్‌, పరభాషా డైరెక్టర్స్‌తో ఎక్కువగా ప్లాన్‌ చేస్తోన్న సూర్య ఎప్పుడో వెట్రిమారన్ దర్శకత్వంలో అనౌన్స్‌ చేసిన వాడి వాసల్ సినిమా అప్‌డేట్స్‌ మాత్రం ఇవ్వట్లేదు. ప్రెజెంట్ వెట్రిమారన్, శింబుతో ఓ మూవీ చేస్తున్నాడు. సూర్య మూడు నాలుగు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. దీంతో వాడివాసల్ ప్రాజెక్ట్ అసలు ఉంటుందో ఉండదో కూడా తెలియడం లేదు. సుధాకొంగరకు హ్యాండిచ్చినట్లే వెట్రికి కూడా సూర్య హ్యాండిచ్చాడన్న వార్తలు వినిపిస్తున్నాయి.

Exit mobile version