ప్రయోగాల జోలికి వెళ్లొచ్చు కానీ.. ఏళ్ల తరబడి ఒకే సినిమాకు కమిటైపోయి ఒళ్లు హూనం చేసుకుని, చేతులు కాల్చుకోరాదు. ప్రయోగాలు చేయరాదు అని సూర్యకు కంగువాతో అర్థమైనట్టే ఉంది. అందుకే ఈ సారి పంథా మార్చి.. ఫ్యాన్స్‌ను ఖుషీ చేయడమే పనిగా పెట్టుకున్నాడు. అభిమానులతో టచ్ మిస్ కాకుండా ఉండేందుకు వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నాడు. అందులోనూ ఓన్ ఇలాకాలోస్టార్ దర్శకుల్ని పక్కన పెట్టి పొరుగు ఇండస్ట్రీ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్‌కు ఛాన్స్ ఇస్తున్నాడు. Also Read…
కంగువా, రెట్రో ఫెయిల్యూర్స్ సూర్యను పూర్తిగా మార్చేశాయి. తన కన్నా వెనకొచ్చిన యంగ్ హీరోస్ ప్రదీప్ రంగనాథన్, శివకార్తీకేయన్.. అవలీలగా వంద కోట్లు, మూడొందల కోట్లు కొట్టేస్తుంటే… తను మాత్రం 200 క్రోర్ మార్క్ దాటడానికి నానా అవస్థలు పడుతున్నాడు. గజినీతో సౌత్‌కే ఫస్ట్ హండ్రెడ్ క్రోర్ చూపించిన ఈ వర్సటైల్ యాక్టర్.. రెట్రోతో మొదట్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ చూసినప్పటికీ.. లాంగ్ రన్‌లో దెబ్బతింది. Also Read:Clinical Trials: కొత్త డ్రగ్స్, క్లినికల్ ట్రయల్ రూల్స్ 2019ని…