SURIYA : సూర్య 50.. కథ రెడీ చేస్తున్న స్టార్ డైరెక్టర్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వచ్చిన ‘కరుప్పు’ చిత్రం సాధించిన అద్భుత విజయంతో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మార్కెట్ రేంజ్ మరింత పెరిగింది. ప్రయోగాత్మక చిత్రాలతో పాటు కమర్షియల్ ఎంటర్టైనర్స్ చేస్తూవస్తున్న సూర్య ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. సూర్య నటిస్తున్న‘విశ్వనాథ్ అండ్ సన్స్‘ విడుదలకు సిద్ధమవుతోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్లాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇన్ సైడ్ టాక్ చాలా బాగుంది. ఇక మలయాళ బ్లాక్‌బస్టర్ ‘ఆవేశం’ ఫేమ్ జితూ మాధవన్ దర్శకత్వంలో నజ్రియా నజీమ్, నస్లేన్ కీలక పాత్రల్లో మరో సినిమా చేస్తున్నాడు సూర్య.
జితూ మాధవన్ సినిమా కంప్లీట్ కాగానే సూర్య తన 48వ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు. ‘జై భీమ్’ లాంటి సెన్సేషనల్ హిట్‌ను అందించిన దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండటం విశేషం. వీరిద్దరి కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచే ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోసారి ఒక పవర్ఫుల్ సోషల్ డ్రామాతో ఈ కాంబో రాబోతున్నట్లు సమాచారం.ఇక సూర్య కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 50వ చిత్రం గురించి కోలీవుడ్‌లో ఒక ఆసక్తికరమైన ప్రచారం సాగుతోంది. ఈ ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్ కోసం జైలర్ ఫేమ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్‌తో చర్చలు జరుగుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ప్రస్తుతం నెల్సన్, సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ‘జైలర్ 2’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ కారణంగానే సూర్య ప్రాజెక్ట్‌పై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ కాంబో గనుక సెట్ అయితే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం.
Also Read
- Sri Sri: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్దే కెమిస్ట్రీ అదిరిపోయిందిగా.. 'శ్రీ శ్రీ' నుంచి 'బొమ్మ బొమ్మ' సాంగ్ రిలీజ్.!
- Dhoom 4: 'ధూమ్ 4' నుంచి రణబీర్ కపూర్ అవుట్ ?... కొత్త హీరో కోసం యశ్ రాజ్ ఫిల్మ్స్ వేట!
- Tollywood: టాలీవుడ్లో గాయాల షాక్.. 'బాబాయ్-అబ్బాయి' జంటలకు సర్జరీలు, షూటింగ్‌లపై ప్రభావం!
- Virat Kohli Anushka: లండన్‌లో ఉన్నా భారత్‌లో పెట్టుబడులు.. మరో లగ్జరీ ఇల్లు సొంతం చేసుకున్న విరాట్, అనుష్క
తాజావార్తలు
-
Kawasaki Ninja 250: కవాసకి నింజా 250 విడుదల.. మిలమిల మెరిసే కొత్త కలర్స్, పవర్ఫుల్ ఇంజన్.. ధర ఎంతంటే?
-
Sri Sri: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్దే కెమిస్ట్రీ అదిరిపోయిందిగా.. ‘శ్రీ శ్రీ’ నుంచి ‘బొమ్మ బొమ్మ’ సాంగ్ రిలీజ్.!
-
Dhoom 4: ‘ధూమ్ 4’ నుంచి రణబీర్ కపూర్ అవుట్ ?… కొత్త హీరో కోసం యశ్ రాజ్ ఫిల్మ్స్ వేట!
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!