‘118’ వంటి సక్సెస్‌ఫుల్ మూవీ తర్వాత ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకుడిగా మారారు. ఇప్పుడు ఆయన తాజాగా మిస్టరీ థ్రిల్లర్ ’డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు’ (ఎవరు, ఎక్కడ, ఎందుకు) మూవీని తెరకెక్కిస్తున్నారు. డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ భాగస్వామ్యంతో థియేటర్స్‌లో గ్రాండ్‌గా త్వరలో రిలీజ్ కాబోతోంది. అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నఈ మూవీ నుండి ఇప్పటికే విడుదలైన టీజర్, ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన అన్ని సాంగ్స్ విశేష ఆదరణ దక్కించుకున్నాయని నిర్మాత తెలిపారు.
చిత్ర సమర్పకుడు సురేష్‌బాబు మాట్లాడుతూ ”రీసెంట్ గా సినిమా చూశాను. క్రిస్పీ నెరేషన్‌తో మంచి పెర్‌ఫామెన్స్‌లతో చాలా థ్రిల్లింగ్ గా తెరకెక్కించారు. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్ని, ఈ కరోనా వల్ల వర్చువల్ వరల్డ్ లో వచ్చిన మార్పులని చక్కగా చూపించారు. అంతర్లీనంగా ఒక మంచి ప్రేమకథ కూడా ఉంది. ‘డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు’ వంటి ఒక మంచి చిత్రాన్ని మీకు థియేటర్లలో అందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది” అని అన్నారు.
చిత్ర నిర్మాత డా. రవి పి. రాజు దాట్ల మాట్లాడుతూ ”మా బేనర్‌లో రూపొందిన ఫస్ట్ మూవీ ఇది. దీనికి సురేష్ ప్రొడక్షన్స్ సమర్పకులుగా వ్యవహరించడం చాలా సంతోషంగా ఉంది. ఇది మా ఫస్ట్ సక్సెస్ గా భావిస్తున్నాం. ఫస్ట్ టైమ్ తెలుగులో వస్తోన్న కంప్యూటర్ స్క్రీన్ మూవీ ఇది. గుహన్‌గారి మేకింగ్ చాలా కొత్తగా ఉంటుంది. అలాగే అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ ఇద్దరు సెటిల్డ్ పెర్‌ఫామెన్స్ ఇచ్చారు. వారిద్దరి కెమిస్ట్రి తప్పకుండా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. త్వరలో ట్రైలర్ రిలీజ్ చేయనున్నాం. కమర్షియల్‌గా పెద్ద విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది” అని చెప్పారు.
