Suresh Babu: కాలానికి అనుగుణంగా సాగే సురేశ్ బాబు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suresh Babu: చిత్రసీమలో ‘ఆ నలుగురు’ అనగానే సినీఫ్యాన్స్ కు స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ గుర్తుకు వస్తారు. కానీ, సినీజనానికి ‘ఆ నలుగురు’ అంటే సురేశ్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు, ఏసియన్ సునీల్ వంటి టాప్ డిస్ట్రిబ్యూటర్స్ స్ఫురిస్తారు. వారిలో అగ్రగణ్యుడుగా నిలచిన సురేశ్ బాబు తెలుగు చిత్రసీమలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు దాని పరిష్కారం కోసం నడుం బిగించేవారిలో ముందువరుసలో ఉంటారు. అందుకే సినీజనం ఆయనను అందరివాడు అంటూ ఉంటారు.
స్టార్ ప్రొడ్యూసర్ గా జేజేలు అందుకున్న డి.రామానాయుడు పెద్దకొడుకుగా సురేశ్ బాబు 1958 డిసెంబర్ 24న జన్మించారు. మద్రాసులోని డాన్ బోస్క్ స్కూల్ లోనూ, లయోలా కాలేజ్ లోనూ విద్యనభ్యసించారు సురేశ్. తరువాత యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ లో డిగ్రీ చదివారు. స్వదేశం వచ్చిన తరువాత నుంచీ తండ్రి చిత్ర నిర్మాణంలో పాలు పంచుకుంటూ సాగారు. ఆయన తండ్రి డి.రామానాయుడు నిర్మాతగా గిన్నిస్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు. తండ్రి చాటు బిడ్డగా ఉంటూనే సురేశ్ బాబు 1990లో ‘బొబ్బిలిరాజా’తో నిర్మాతగా మారారు. అప్పటి నుంచీ తమ సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేశ్ బాబు పలు చిత్రాలు నిర్మించారు. తన తమ్ముడు వెంకటేశ్ ను టాలీవుడ్ స్టార్ హీరోస్ లో ఒకరిగా నిలపడం కోసం సురేశ్ బాబు చేసిన కృషిని ఎవరూ మరచిపోలేరు. ఇక నిర్మాతగా తన ప్రతి చిత్రంలోనూ ఏదో ఒక కొత్తదనం చొప్పించడానికి సురేశ్ బాబు సదా ప్రయత్నించేవారు.
Also Read
- Jackky Bhagnani: హీరోయిన్ రకుల్‌తో పెళ్లై ఏడాది కూడా కాకముందే డేటింగ్ యాప్‌లో జాకీ భగ్నానీ? వైరల్ అవుతున్న లీక్స్!
- Anantha Sriram: ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ టార్గెట్‌గా అనంత శ్రీరామ్ కామెంట్స్? కర్ణుడు - అర్జునుడి పాత్రలను అలా చూపిస్తారా!
- Irumudi Kattu: సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అయిన రవితేజ.. ‘ఇరుముడి కట్టు’ రిలీజ్ టైం ఫిక్స్!
- Dil Raju: 'సినిమాల్లో ఫెయిలైతే మళ్లీ అక్కడికే వెళ్లిపోయే వాడిని..': ప్రొడ్యూసర్ దిల్ రాజు
తెలుగులోనే కాదు, దక్షిణాదిన ఎందరో ప్రముఖ నిర్మాతల తనయులు తండ్రుల బాటలోనే పయనిస్తూ నిర్మాతలయ్యారు. అయితే సురేశ్ బాబు మాత్రం కాలానికి అనుగుణంగా సాగుతూ చిత్రనిర్మాణం సాగించారు. అరుదైన విజయాలను సొంతం చేసుకున్నారు. తండ్రి తనకు ఆస్తిగా ఇచ్చిన నిర్మాణసంస్థ, స్టూడియోస్, పంపిణీ సంస్థ, పబ్లిసిటీ సంస్థ వంటి వాటిని ఎంతో చాకచక్యంగా నిర్వహించారు. ముఖ్యంగా తెలుగునాట థియేటర్లను లీజుకు తీసుకొని మూతపడిపోనున్న ఎన్నో సినిమా హాళ్ళకు ఆ దుస్థితి పట్టకుండా కాపాడిన ఘనత సురేశ్ బాబుదే అని చెప్పవచ్చు. ఇక క్రేజీ కాంబినేషన్స్ లో రూపొందే చిత్రాలకు భాగస్వామిగానూ ఉంటున్నారు సురేశ్ బాబు. ఈ మధ్య మునుపటిలా వేగంగా చిత్రనిర్మాణం సాగించడం లేదు.
సురేశ్ బాబు తనయుడు రానా నవతరం నాయకునిగా సాగిపోతున్నారు. సురేశ్ బాబు నిర్వహణలోనే రామానాయుడు ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ సాగుతోంది. అందులో శిక్షణ పొందిన వారికి తమ చిత్రాల ద్వారా అవకాశాలూ కల్పిస్తున్నారు. సురేశ్ బాబు చిన్నకొడుకు అభిరామ్, తేజ దర్శకత్వంలో ‘అహింస’ చిత్రంతో హీరోగా పరిచయం కానున్నాడు. కాలానికి అనుగుణంగా అడుగులు వేసే సురేశ్ బాబు మునుముందు ఏ తీరున చిత్రసీమలో సాగుతారో చూద్దాం.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్‌తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!