టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనగానే గుర్తొచ్చే పేరు సురేఖా వాణి. పద్దతికి పట్టు చీర కట్టినట్లు ఉండే ఈ అమ్మడు సోషల్ మీడియా లో మాత్రం సెగలు పుట్టిస్తోంటుంది. కూతురు సుప్రీతతో కలిసి వీడియోలు చేస్తూ మంటలు పుట్టిస్తూ ఉంటుంది. ఇక చిట్టి పొట్టి డ్రెస్ లో సురేఖా వాణి, సుప్రీతను చూస్తే వీళ్ళసలు తల్లి కూతుళ్లా..? అక్కాచెల్లెళ్లా..? అని అనుమానం రాకమానదు.
ఇక తాజాగా ఈ తల్లీకూతుళ్లు న్యూ ఇయర్ విషెస్ ని కూడా అంతే హాట్ గా చెప్పారు. తాజాగా సురేఖా వాణి, తన కూతురు సుప్రీతతో కలిసి చేసిన ఒక వీడియోను షేర్ చేసింది. ఇక అందులో గ్రీన్ కలర్ టాప్ లో సురేఖ కనిపించగా.. పూల డ్రెస్ లో సుప్రీత సందడి చేసింది. మోకాళ్ళ వరకు ఉన్న ఆ డ్రెస్ లో తల్లికూతుళ్ల హాట్ హాట్ గా కనిపించారు. ఇక వీళ్ళసలు తల్లి కూతుళ్లా..? అక్కాచెల్లెళ్లా..? అని అనుమానం వస్తుందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.