Supriya Yarlagadda Comments on Nagarjuna: టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి కన్నడ బ్లాక్ బస్టర్ హాస్టల్ హుడుగారు బేకగిద్దరే ను తెలుగులో ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో విడుదల చేస్తున్న క్రమంలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాత సుప్రియ యార్లగడ్డ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలు పంచుకున్నారు. ఈ క్రమంలో అన్నపూర్ణ స్టూడియోస్ లో ట్రెండీ కంటెంట్ చేయడంలో ఎలాంటి సన్నాహాలు చేస్తున్నారు ? అని ఆమెను అడిగితే ముందుగా లెగసీని కాపాడుకోవడం చాలా ముఖ్యం అని అన్నారు. ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్న ఆమె, ‘మనం’ కోసం రెండేళ్ళ పాటు పనిచేశా, మరో పది రోజులు ఉందనగా తాతగారి కండీషన్ తెలిసింది, అప్పటికే ఆయన 255 సినిమాలు పూర్తి చేసుకున్నారు, అది ఆయన చివరి సినిమాగా పూర్తి చేయాలని అనుకున్నపుడు నాపై ఎంత ఒత్తిడి వుంటుందో మీరే ఆలోచించండని అన్నారు. అప్పటి నుంచి రోజుకి 22 గంటలు పని చేశాం, సినిమా విజయవంతమైయింది, అది వేరే విషయం.
Chandrayaan 3: చంద్రయాన్ 3 సక్సెస్.. మన స్టార్లు ఏమన్నారంటే.. ?
ఎవరితో తిట్టించుకోలేదనే గొప్ప విషయం అని నవ్వూతూ చెప్పుకొచ్చారు. తాతగారు నన్ను తిడుతూనే ఉంటారు అని పేర్కొన్న ఆమె ఇప్పటికి నెలకోసారి కల్లోకి వస్తారు, ఏదో తిడతారు అని నవ్వుతూ అన్నారు. నాగార్జున గారి విషయానికి వస్తే ఆయన కంటే బెటర్ ప్రొడ్యూసర్ ఎవరు లేరని, ఆయన ఎప్పుడో చేసినవి ఇప్పుడు చాలా మంది చేస్తున్నారని అన్నారు. నాగార్జున గారు యాక్టర్ అవ్వడం వలన ఈ స్టూడియో నిలిచిందని భావిస్తానని పేర్కొన్న ఆమె, ఎంతో మందికి అన్నపూర్ణ ఇండస్ట్రీ కి హబ్ గా మారిందని అన్నారు. మొన్న ఒకసారి ఇక్కడ పార్కింగ్ కి స్థలం సరిగ్గా దొరకలేదు, నాగార్జున గారు చూస్తే తిడతారేమో అని భయపడ్డా కానీ తీరా ఆయన చూసి ‘తాత వుంటే చాలా ఆనందపడే వారు కదా’ అన్నారు. దీనికి కారణం.. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రారంభమైనప్పుడు తాత, అమ్మమ్మ ఇక్కడ కూర్చుని ‘ఈ నెల కూడా ఎవరూ షూటింగ్ కి రాలేదండి’ అని అమ్మమ్మ అనేవారట, ఇప్పుడిది ఇంత పెద్దగా ఎదిగిందంటే ఇందులో తాతగారు, నాగార్జున గారి కృషి ఉందని ఆమె అన్నారు.