Supreme Sundar Stunts for Naga Chaitanya’s Thandel: నాగచైతన్య ప్రస్తుతానికి చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమా చేస్తున్నాడు. బంగార్రాజు సినిమా తర్వాత సరైన హిట్ లేని నాగచైతన్య ఎలా అయినా హిట్ కొట్టాలని కసితో కాస్త రా అండ్ రస్టిక్ ఫీల్ ఇచ్చే సినిమాతో ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పనులు మొదలుపెట్టినప్పటి నుంచి భారీ అంచనాలు ఏర్పడుతూ వస్తున్నాయి. సినిమా స్టోరీ నిజంగా జరిగినది కావడం, ఇండియా – పాకిస్తాన్ మధ్య వివాదాస్పద అంశం మీద సినిమా కావడంతో ప్రేక్షకులలో సాధారణంగానే ఈ సినిమా మీద అంచనాలున్నాయి. ఇక ఆ అంచనాలను మరింత పెంచే విధంగా సాయి పల్లవిని ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకువచ్చారు మేకర్స్.
Mythri Theatres: మరో థియేటర్ ఓపెన్ చేసేసిన మైత్రీ సంస్థ!
ఇక ఇప్పుడు నాగచైతన్య కోసం మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమాలో ఉన్న ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ కోసం ఒక ఫేమస్ స్టంట్ మాస్టర్ ని రంగంలోకి దించారు. ఆయన ఎవరో కాదు సుప్రీం సుందర్.. ఆయన మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుం కోషియం సినిమాతో పాటు ఈ మధ్యనే వచ్చిన యానిమల్ సినిమాకి స్టంట్ మాస్టర్ గా పనిచేశారు. ఆయన పర్యవేక్షణలోనే నాగచైతన్యతో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేశారని, అది ఒక రేంజ్ లో వర్కౌట్ అయిందని థియేటర్లో కచ్చితంగా ప్రేక్షకులందరూ ఎంజాయ్ చేసే విధంగా యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేశారని తెలుస్తోంది.. గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.