సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి వచ్చే మూవీకి తమిళ్ లో మాత్రమే కాదు తెలుగులో కూడా సూపర్ బజ్ ఉంటుంది. డైరెక్టర్ తో సంబంధం లేకుండా రజినీకాంత్ మ్యాజిక్ తోనే మార్కెట్ క్రియేట్ అవుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం రజినీ నటిస్తున్న సినిమా ‘జైలర్’ మాత్రం అసలు బజ్ జనరేట్ చెయ్యలేకపోతోంది. ఆగస్టు 10న రిలీజ్ పెట్టుకోని కనీసం ఒక్క అప్డేట్ కూడా రిలీజ్ చెయ్యకుండా సన్ పిక్చర్స్ సైలెంట్ గా ఉన్నారు. తన సినిమా ప్రమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో చేసే దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కూడా జైలర్ విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉన్నాడో ఎవరికీ అంతుబట్టని విషయంగా ఉంది. జైలర్ సినిమా మరో మూడు వారాల్లో రిలీజ్ కానుంది. ఈ మూవీ నుంచి తమిళ వర్షన్ లో ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యి ఇన్స్టాంట్ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. తెలుగులో జైలర్ సినిమా రిలీజ్ అవుతున్నా కూడా ఈ సాంగ్స్ తెలుగు వెర్షన్ ని రిలీజ్ చేయలేదు.
తెలుగు మాత్రమే కాదు తమిళ్ తప్ప ఇతర ఏ భాషలో జైలర్ సాంగ్స్ అండ్ ప్రమోషనల్ కంటెంట్ బయటకి రాలేదు. రజినీకాంత్ తో పాటు మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ కూడా జైలర్ సినిమాలో నటించారు. పర్ఫెక్ట్ గా ప్రమోషన్స్ చేస్తే జైలర్ దెబ్బకి సౌత్ బాక్సాఫీస్ షేక్ అయ్యేది కానీ మేకర్స్ మాత్రం ఈ విషయంలో చాలా నీరసంగా ఉన్నారు. తెలుగులో అయితే లిటరల్లీ జీరో ప్రమోషన్స్. ఇంటెన్షనల్ గా జైలర్ ప్రమోషన్స్ ని చెయ్యకుండా ఉంటున్నారో లేక తమిళ్ హిట్ కొడితే చాలు అనుకుంటున్నారో తెలియదు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే జైలర్ సినిమాకి ఓపెనింగ్స్ కూడా వచ్చేలా కనిపించట్లేదు. సినిమా అద్భుతంగా ఉంటే కాని కలెక్షన్స్ లో బూస్ట్ కనిపించదు.