సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘గుంటూరు కారం’. అతడు, ఖలేజా సినిమాల తర్వాత దాదాపు పుష్కరం గ్యాప్ తీసుకోని త్రివిక్రమ్-మహేష్ బాబు నుంచి వస్తున్న సినిమా కావడంతో గుంటూరు కారం సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలకి తగ్గట్లే మాస్ స్ట్రైకింగ్ గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేసిన చిత్ర యూనిట్, ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. గత కొంతకాలంగా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తున్న మహేష్ ఈసారి మెసేజ్ ని పక్కన పెట్టి పూర్తిగా మాస్ లుక్ లోకి వచ్చేసాడు. గల్ల లుంగీ, కారా బీడీ, చేతిలో కర్రతో మహేష్ బాబు నెవర్ బిఫోర్ మాస్ లుక్ లో కనిపించాడు. దీంతో మహేష్ బాబు గుంటూరు కారం సినిమా నుంచి ఎప్పుడు ఏ అప్డేట్ వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ గుంటూరు కారం సినిమాని షూట్ చేస్తున్నాడు త్రివిక్రమ్. మధ్యలో షూటింగ్ కి బ్రేక్ వచ్చినా కూడా సంక్రాంతి టార్గెట్ ని మిస్ అయ్యేదే లేదు అంటూ మహేష్ కూడా చెప్పేసాడు. ప్రస్తుతం గుంటూరు కారం సినిమా లేటెస్ట్ షెడ్యూల్ లో ఫైట్ సీన్ ని తెరకెక్కిస్తున్నారు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ని రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసారు. దాదాపు పది రోజుల పాటు ఒక ఫైట్ సీన్ ని షూట్ చేస్తున్నారు అంటే ఈ యాక్షన్ బ్లాక్ సినిమాకి ఎంత ఇంపార్టెంట్ అనేది అర్ధం చేసుకోవచ్చు. ఇక గుంటూరు కారం సాంగ్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ విషయంలో ఒక మహేష్ ఫ్యాన్.. “ఈసారి సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోవాలి” అంటూ థమన్ ని ట్యాగ్ చేసి ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్ కి రెస్పాండ్ అవుతూ థమన్ స్టెన్ గన్ జిప్ ని పోస్ట్ చేసాడు. మరి ఫస్ట్ సాంగ్ ఎప్పుడు బయటకి వస్తుంది? ఏ రేంజులో సౌండ్ చేయబోతుంది అనేది చూడాలి.
🔥🧨 https://t.co/za4HspU3Rq pic.twitter.com/u4Om3D4M9I
— thaman S (@MusicThaman) September 4, 2023