బాలీవుడ్ ఐటెం బాంబ్ సన్నీ లియోన్ కి వివాదాలు కొత్తేమి కాదు. అమ్మడు ఏ సాంగ్ చేసినా అందులో ఏదో ఒక వివాదం ఉంటూనే ఉంటుంది. ఇక ఈ మధ్యన కొద్దిరోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ తాజాగా ఒక ప్రైవేట్ ఆల్బమ్ లో నటించింది. కనికా కపూర్ పాడిన ఈ సాంగ్ ఈ బుధవారం రిలీజ్ అయ్యిం రచ్చ చేస్తోంది. సన్నీ లియోన్ అందాలు సాంగ్ లో హైలైట్ గా నిలిచాయి. ఇక ఈ పాటపై పలు హిందు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
హిందువుల మనోభావాలను దెబ్బ తీసినట్లుగా సాంగ్ లిరిక్స్ ఉన్నాయని, రాధా మధుబన్ అంటూ సాగిన ఈ సాంగ్ లో రాధను అవమానించారని మండిపడుతున్నారు. రాధ కృష్ణుడికి భక్తురాలే కానీ నర్తకి కాదని ,. మధుబన్ లో రాధ ఎలా డాన్స్ చేస్తోందని విమర్శించారు. ఆ లిరిక్స్ అంతా రాధ గురించి ఉండడంతో వాటిని వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం సన్నీ సాంగ్ వివాదంతోనెట్టింట రచ్చ లేపుతోంది.