Site icon NTV Telugu

Sunil: సునీల్‌కి మరో బంపరాఫర్.. ఆ తమిళ సినిమాలో కీ-రోల్

Sunil Mark Antony Film

Sunil Mark Antony Film

Sunil Got Another Golden Chance From Kollywood: సునీల్ కెరీర్‌ని ‘పుష్ప’ సినిమా అనూహ్య మలుపు తిప్పిందని చెప్పుకోవడంలో సందేహమే లేదు. అప్పటివరకు ఓ మాదిరిగా సాగిన అతని సినీ కెరీర్.. ‘పుష్ప’ తర్వాత ఒక్కసారిగా ఊపందుకుంది. ఒకదానికి తర్వాత మరొక క్రేజీ అవకాశాలను అతడు అందిపుచ్చుకుంటున్నాడు. ముఖ్యంగా.. ప్రతినాయకుడిగానే ఎక్కువ ఛాన్సులు పొందుతున్నాడు. రీసెంట్‌గా.. సూపర్‌స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘జైలర్’ సినిమాలో విలన్‌గా సునీల్ ఛాన్స్ కొట్టేశాడు. ఇప్పుడు లేటెస్ట్‌గా కోలీవుడ్ నుంచే మరో అద్దిరిపోయే ఛాన్స్‌ని అతను అందుకున్నాడు.

SKN Trolled Dil Raju: దిల్‌రాజుని వేదికపై ట్రోల్ చేసిన ఎస్కేఎన్.. భలే ఇరుక్కు

తమిళ హీరో విశాల్ ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘మార్క్ ఆంటోనీ’ సినిమాలో సునీలో ఓ మేజర్ రోల్‌లో నటించే ఆఫర్‌ని పొందాడు. ఈ విషయాన్ని స్వయంగా చిత్రబృందమే ఒక పోస్టర్ ద్వారా అధికారికంగా వెల్లడించింది. ఆ పోస్టర్‌లో పుష్పలో సునీల్ వేసిన గెటప్‌నే వేయడాన్ని బట్టి చూస్తుంటే.. ఇందులోనూ కరుడుగట్టిన విలన్ పాత్రలో అతడు కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి.. చాలాకాలం తర్వాత సునీల్ సెకండ్ ఇన్నింగ్స్ గట్టిగానే జోరందుకుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాను అధిక్ రవిచంద్రన్ తన స్వీయ రచనా దర్శకత్వంలో రూపొందిస్తున్నాడు. ఇందులో ఎస్‌జే సూర్య కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇవి రెండో కాదు.. మావీరన్, జపాన్ సినిమాల్లోనూ సునీల్ నటిస్తున్నాడు.

IND Vs NZ: రెండో వన్డే మనదే.. సిరీస్ కూడా మనదే..!!

కాగా.. తొలుత కమెడియన్‌గా తన కెరీర్ ప్రారంభించిన సునీల్, ఆ తర్వాత హీరోగా అవతారమెత్తాడు. కథానాయకుడిగా మొదట్లో కొన్ని మంచి విజయాలే అందుకున్నాడు కానీ, ఆ తర్వాత గాడి తప్పాడు. దీంతో మళ్లీ కమెడియన్‌గా రీఎంట్రీ ఇచ్చాడు. అలాగే నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ కూడా చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే ‘పుష్ప’లో మంగళం శ్రీనుగా నటించి, అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఆ సినిమానే అతనికి వరుసగా ఆఫర్లు తెచ్చిపెడుతున్నాయి.

Neeta Pawar Missing: కన్నడ నటుడి సోదరి మిస్సింగ్.. మూడు రోజులైనా..

Exit mobile version