బుల్లితెరపై తన సత్తాచాటి ఇప్పుడు వెండితెరపై తానేంటో చూపిద్దామని వస్తుంది యాంకర్ సుమ. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం జయమ్మ పంచాయితీ. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 6 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్రబృందం వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఇక ప్రతి ఇంటర్వ్యూలోనూ సుమ ఎదుర్కొంటున్న ప్రశ్న.. రాజీవ్ కనకాల తో విభేదాలు ఉన్నాయా..? మీరు ఇద్దరు విడాకులు తీసుకున్నారా..? అని .. గత కొన్నిరోజులుగా రాజీవ్, సుమ విడాకులు తీసుకున్నారని, వారిద్దరూ ప్రస్తుతం విడిగా ఉంటున్నారని వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్తలో నిజం లేకపోలేదు అని రాజీవ్ బహిరంగంగానే చెప్పాడు. నేను, సుమ కొన్ని రోజులు విడిగా ఉన్నామని, కొన్ని విభేదాలు మా మధ్య కూడా వచ్చాయని చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూ లో సుమ సైతం విడాకులపై స్పందించింది.
” రాజీవ్ ను నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మాకు పెళ్ళై 23 ఏళ్లు అవుతుంది. ఈ 23 ఏళ్లు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. భార్యాభర్తలు అన్నాకా విభేదాలు రావడం సహజం. అదీకాకుండా ఇండస్ట్రీలో ఉన్నవారిపై ఇలాంటి పుకార్లు వస్తూ ఉంటాయి. అది అందరికి తెలిసిన విషయమే. ఇలా రూమర్స్ వచ్చినప్పుడల్లా నా ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తూ వాటికి చెక్ పెడుతూ ఉంటాను. కొంచెం బాధగానే ఉంటుంది ఆ పుకార్లు విన్నప్పుడు కానీ అలవాటు అయిపోయింది. ఇండస్ట్రీలో ఇవన్నీ సాధారణం” అని చెప్పుకొచ్చింది. ఇక సుమ వ్యాఖ్యలతో పుకార్లకు చెక్ పడినట్లయ్యింది. మరి మే 6 న రిలీజ్ అవుతున్న ‘జయమ్మ పంచాయితీ’ తో సుమ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.