Sukumar : టాలీవుడ్ లో సుకుమార్ శిష్యుల దండయాత్ర..
- ఆ ముగ్గురి హవా
- తొలి సినిమాలతోనే రికార్డులు
- రెండో సినిమాతో అంచనాలు పీక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sukumar : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు సుకుమార్ శిష్యుల దండయాత్ర కొనసాగుతోంది. సుకుమార్ దగ్గర క్లాసులు తీసుకున్న వారు ఇప్పుడు టాలీవుడ్ ను ఊపేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఓ ముగ్గురు మాత్రం సెన్సేషన్ అయిపోయారు. వారే బుచ్చిబాబు సాన, శ్రీకాంత్ ఓదెల, కార్తీక్ దండు. ఈ ముగ్గురూ సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేశారు. సుకుమార్ దగ్గర డైరెక్షన్ లో పాఠాలు నేర్చుకున్నారు. సుకుమార్ సినిమాను తీసే విధానాన్ని, ప్రేక్షకుల పల్స్ ను పట్టేసుకున్నారు. ఇప్పటి వరకు ఈ ముగ్గురూ ఒక్కో సినిమానే తీసి వాళ్ల సత్తా చూపించారు. బుచ్చిబాబు తీసిన ఉప్పెన సినిమా వంద కోట్ల వసూళ్లు సాధించింది. కొత్త నటీనటులతో తీసి ఔరా అనిపించుకున్నాడు.
Read Also : Zelenskyy: ‘‘త్వరలో పుతిన్ చనిపోతారు’’.. జెలెన్స్కీ సంచలన ప్రకటన..
Also Read
ఆయన తీసిన విధానం, డైలాగులు, పాత్రల పర్ఫార్మెన్స్ ఒకరకంగా సుకుమార్ ను చూపించాయి. శ్రీకాంత్ ఓదెల కూడా తన మొదటి సినిమా దసరాతో దుమ్మలేపాడు. బాగా ఎక్స్ పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లాగా తీసి అతను కూడా వంద కోట్ల మార్క్ అందుకున్నాడు. అటు కార్తీక్ దండు కూడా అంతే. తన మొదటి సినిమా విరూపాక్షతో వంద కోట్ల క్లబ్ లో చేరాడు. ఇలా ముగ్గురూ మొదటి సినిమాతోనే వంద కోట్ల మార్క్ దాటేశారు. ఇప్పుడు రెండో సినిమాను అంతకు మించి అన్నట్టే తీస్తున్నారు. బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా వస్తున్న పెద్ది సినిమా ఫస్ట్ లుక్ ఈరోజే విడుదలైంది. ఆ లుక్ చూసే ఇండస్ట్రీ షాక్ అయిపోయింది.
రామ్ చరణ్ ను ఇంత రగ్డ్ లుక్ లో ఇప్పటి వరకు ఎవరూ చూపించలేదు. ఒక్క దెబ్బతో మూవీపై హైప్ ఎక్కడికో వెళ్లిపోయింది. అటు శ్రీకాంత్ ఓదెల మరోసారి నానితో ప్యారడైజ్ మూవీ తీస్తున్నాడు. ఈ మూవీ టీజర్ ఇండస్ట్రీని దిమ్మతిరిగేలా చేసింది. నాని గెటప్, లుక్, కథ అంతా డిఫరెంట్ గా ఉంది. ఏదో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తున్నట్టు అనిపిస్తోంది. పైగా నాని చేతి మీద లం… కొడుకు అని రాసిఉండటం అందరినీ షాక్ కు గురి చేసింది. ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
అటు కార్తీక్ దండు తన రెండో సినిమాను నాగచైతన్యతో తీస్తున్నాడు. ఆ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ అప్పట్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇలా ఈ ముగ్గురూ సుకుమార్ దగ్గర నేర్చుకున్న పాఠాలతో ఇండస్ట్రీని ఏలేలా కనిపిస్తున్నారు. గురువును మించే శిష్యులు అయినా ఆశ్చర్యపోనవసరం లేదేమో. ఈ ముగ్గురు శిష్యుల సినిమాలకు సుకుమార్ సపోర్టు ఫుల్ గా ఉంటుంది. పైగా ఆయన కో ప్రొడ్యూసర్ గా ఉంటున్నాడు వీరి సినిమాలకు. ఎంతైనా సుకుమార్ క్లాసులు చెబితే రిజల్ట్ ఇలాగే ఉంటుంది.
తాజావార్తలు
-
CJP Deepfake Case: PM మోదీతో మహిళ మార్ఫ్డ్ ఫొటోలు.. CJP నేతలకు హైకోర్టు నోటీసులు
-
Trump-Jinping: ట్రంప్ విందుకు అందరూ వచ్చారు.. అసలైనోడే డుమ్మా కొట్టాడు.. ఎవరా ముఖ్యుడు!
-
CM Revanth Reddy : సీఎం రేవంత్‌కు కేరళలో ఘన గౌరవం.. ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డు.!
-
Kaaka Update: సంక్రాంతి బరి నుంచి తగ్గేదేలే.. ‘కాకా’ పనులు షురూ!
-
Gyanesh Kumar: ‘జ్ఞానేష్ కుమార్‌కు పద్మభూషణ్ ఇవ్వాలి’.. బెంగాల్ బీజేపీ చీఫ్ వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!