“నెత్తురు మరిగిన హంగ్రీ చీత… శత్రువును ఎంచితే మొదలు వేట… చూపుగాని విసిరితే ఓరకంట, డెత్ కోట కన్ఫర్మ్ అంట… ఎవరికీ అందదు, అతని రేంజ్… రెప్ప తెరిచేను, రగిలే రివెంజ్… పవర్ అండ్ పొగరు ఆన్ ది సేమ్ పేజ్… ఫైర్ స్ట్రామ్ లాంటి రేజ్…” ఈ లిరిక్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని యూత్ అంతా రిపీట్ మోడ్ లో పాడుతున్నారు. యూత్ లో ఉండే ఫైర్ ని బయటకి తీస్తే థమన్… పవన్ కళ్యాణ్ కి ఇచ్చిన ఈ థంపింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ OG గ్లిమ్ప్స్ ని ఎలివేట్ చేసింది. సుజిత్ స్టైలిష్ మేకింగ్ కి, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ కి థమన్ ఇచ్చిన ఈ బీజీఎమ్ రచ్చ లేపుతోంది. డిజిటల్ రికార్డ్స్ ని క్రియేట్ చేస్తున్న OG గ్లిమ్ప్స్ లో సుజిత్ ఒక హిడెన్ క్లూ ఇచ్చినట్లు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. OG గ్లిమ్ప్స్ లో బాంబే పోర్ట్ దగ్గర… వాజీ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అనే కంపెనీ పేరు కనిపించింది.
వాజీ అనే పేరు వినగానే ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ సాహో సినిమా గుర్తొస్తుంది. ఈ మూవీ కోసం వాజీ అనే సిటీని సుజిత్ క్రియేట్ చేసాడు. అండర్ వరల్డ్ సిండికేట్ కి నాయకుడు అయ్యి వాజీ నుంచి ప్రభాస్ మాఫీయాని రూల్ చేయడంతో సాహో సినిమా ఎండ్ అవుతుంది. ఆ వాజీ సిటీకి OGలో చూపించిన వాజీ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ కి ఏదైనా లింక్ ఉందో లేదో తెలియదు కానీ ప్రభాస్-పవన్ కళ్యాణ్ మ్యూచువల్ ఫ్యాన్స్ మాత్రం… సుజిత్ ఒక యూనివర్స్ క్రియేట్ చేసి, ప్రభాస్ అండ్ పవన్ కళ్యాణ్ ని కలిపి ఫ్యూచర్ లో ఒక సినిమా చేస్తే మాత్రం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఒక్క రికార్డ్ కూడా మిగలదు. మరి ఇది యాదృచ్చికంగా జరిగిందా లేక సుజిత్ ఏమైనా మాస్టర్ ప్లాన్ వేశాడా అనేది చూడాలి.