Sujith : ఎట్టకేలకు ఓజీతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. డైరెక్టర్ సుజీత్ పేరు మార్మోగిపోతోంది. ఈ క్రమంలోనే సుజీత్ తన తర్వాత సినిమా ఎవరితో చేస్తాడా అని అంతా వెయిట్ చేస్తున్నారు. గతంలో నేచురల్ స్టార్ నానితో ఓ సినిమా ఓకే అయింది. కానీ అనుకోకుండా ఆ మూవీ పట్టాలెక్కకుండానే క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఓజీ సక్సెస్ కావడంతో తర్వాత మూవీ నానితో చేస్తాడేమో అంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఓదెలతో ది ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు.
Read Also : Gouthami : పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్స్ ఉంటే తప్పేంటి.. గౌతమి కామెంట్స్
అది వచ్చే సమ్మర్ లో రిలీజ్ కాబోతోంది. ఈ గ్యాప్ లో నానికి కథ చెప్పి ఓకే చేయించుకోవాలని సుజీత్ ప్లాన్ చేసుకుంటున్నాడంట. గతంలో నానికి కమిట్ మెంట్ల ఎక్కువగా ఉండటంతో సుజీత్ సినిమా చేయలేకపోయాడు. ఇప్పుడు ఓజీతో సుజీత్ ఫామ్ లో ఉన్నాడు కాబట్టి నాని కూడా ఓకే చేసే అవకాశాలు ఉన్నాయి. సమ్మర్ లోపు మంచి స్క్రిప్టు రెడీ చేసి సినిమా చేయాలని సుజీత్ ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అన్నీ కుదిరితే త్వరలోనే నానిని కలిసే ఛాన్స్ ఉందంట. నాని చేతిలో ఈ సినిమా తర్వాత మరో సినిమాకు కమిట్ కాలేదు. కాబట్టి సుజీత్ తో చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Read Also : Gouthami : ప్రూఫ్ చూపిస్తే రాళ్లతో కొట్టించుకుని చస్తా.. గౌతమి చౌదరి సవాల్..