OG : పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఓజీతో ఫుల్ ఖుషీలో ఉన్నారు. అంచనాలకు తగ్గట్టే పవన్ కల్యాణ్ సీన్లు ఉండటంతో కల్ట్ ఫ్యాన్స్ చాలా కాలం తర్వాత పండగ చేసుకుంటున్నారు. ఓజీ 2 కూడా ఉంటుందని మొదటి పార్టులోనే హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్. అయితే దీనిపై రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. ఓజీ 2లో సాహో సినిమాను కలిపి తీస్తాడని కొందరు అంటుంటే.. రెండో పార్టును అకీరా నందన్ తో చేస్తాడని కొందరు చెబుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుజీత్.. అకీరాతో సినిమా చేయడంపై క్లారిటీ ఇచ్చాడు. ఓజీ సినిమా సెట్స్ కు అకీరా కూడా వచ్చాడని.. అతనిలో మంచి స్పార్క్ ఉందని తెలిపాడు సుజీత్.
Read Also : OG : ఫ్యాన్స్ కు ఏళ్ల కల తీర్చేసిన సుజీత్..
ఓజీ 2 అకీరా నందన్ తో తీయాలా వద్దా అనేది మీరు పవన్ కల్యాణ్ గారినే అడగాలి. ఎందుకంటే అది ఆయన ఇష్టం. ఒకవేళ అకీరాతో తీస్తే మంచిదే కదా. దానికి నేను కూడా ఒప్పుకుంటాను. అతనిలో ఓ వైబ్ ఉంది. ఇంతకు మించి నేను ఏం మాట్లాడను. ఎందుకంటే అది ఎక్కడికో వెళ్లిపోతుంది. కాబట్టి దీన్ని ఇక్కడితే స్టాప్ చేస్తాను అంటూ తెలిపాడు సుజీత్. ఆయన మాటలను బట్టి ఓజీ2 అకీరాతో చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియా మొత్తం ఫ్యాన్స్ ఇదే విషయాన్ని రచ్చ చేస్తున్నారు. అకీరా సినిమాల్లోకి రావాలని పవన్ ఫ్యాన్స్ ఎంతగానో కోరుకుంటున్నారు. ఇలాంటి టైమ్ లో సుజీత్ కామెంట్లు మరింత జోష్ ను నింపుతున్నాయి.
Read Also : Ameesha Patel : చాలా మందితో డేటింగ్ చేశా.. అది నచ్చలేదు