OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు ఏళ్ల కలను డైరెక్టర్ సుజీత్ తీర్చేశాడు. నిన్న థియేటర్లలోకి వచ్చిన ఓజీ మూవీ ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. చాలా కాలం తర్వాత ఫ్యాన్స్ కోరుకున్నట్టు పవన్ కనిపించడంతో ఫుల్ ఖుషీలో ఉన్నారు. చాలా మంది థియేటర్లలోనే ఏడ్చేస్తున్నారు. ఇదంతా సుజీత్ వల్లే జరిగిందంటూ అతన్ని మోసేస్తున్నారు. అయితే తాజాగా మూవీకి ఫస్ట్ డే కలెక్షన్లపై నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన చేసింది. ఓజీ ఫస్ట్ డే రూ.154 కోట్లు కలెక్ట్ చేసిందని పోస్టర్ రిలీజ్ చేసింది. ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ కెరీర్ లోనే ఇది హయ్యెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్లు. పవన్ కు కల్ట్ ఫ్యాన్స్ కోట్లలో ఉన్నారు. కానీ సరైన సినిమా పడక ఈ స్థాయి కలెక్షన్లు ఎన్నడూ రాలేదు.
Read Also : Ameesha Patel : చాలా మందితో డేటింగ్ చేశా.. అది నచ్చలేదు
పవన్ కంటే తక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలు కూడా ఇప్పటికే రూ.200 కోట్ల క్లబ్ లో చేరిపోయారు. కానీ పవన్ కెరీర్ లో వంద కోట్ల సినిమా కూడా ఇప్పటి వరకు రాలేదు. ఇదే ఫస్ట్ టైమ్. మొదటి రోజే రూ.100 కోట్లు రాబట్టాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. అది ఓజీతో సాధ్యం అయిపోయింది. అందుకే సుజీత్ ను సోషల్ మీడియాలో తెగ మోసేస్తున్నారు. వ్యక్తిగతంగా సుజీత్ కూడా పవన్ కల్యాణ్ కు వీరాభిమాని. అందుకే సుజీత్ ను ఎక్కువగా పొగిడేస్తున్నారు. సుజీత్ ఈ సినిమాను గత మూడేళ్ల నుంచి తీస్తున్నాడు. సాహో తర్వాత ఇన్నేళ్లు ఎదురు చూసిన సుజీత్.. తన అభిమాన హీరోతోనే సినిమా చేసి హిట్ అందుకున్నాడు. దీని తర్వాత ఆయనకు వరుసగా పెద్ద హీరోలతో సినిమా ఛాన్సులు వచ్చేస్తున్నాయంట.
Read Also : OG : అప్పుడు హరీష్.. ఇప్పుడు సుజీత్.. అదే సెంటిమెంట్..