Sudigali Sudheer:సుడిగాలి సుధీర్.. గాలోడు సినిమా తరువాత వరుస సినిమాలతో బిజీగా మారాడు. ప్రస్తుతం సుధీర్ చేతిలో రెండు, మూడు సినిమాల వరకు ఉన్నాయి. అందులో ఒకటి గోట్(GOAT)..గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనేది ట్యాగ్ లైన్. పాగల్ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో.. సుధీర్ సరసం బ్యాచిలర్ భామ దివ్య భారతి హీరోయిన్‌గా నటిస్తుస్తుంది. ఇక ఈ సినిమాను మహాతేజ క్రియేషన్స్ పతాకంపై చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది.
ఇక ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేశారు మేకర్స్. ప్రమోషన్స్ లో భాగంగా మొదటి సింగిల్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. అయ్యో పాపం సారూ అంటూ సాగే సాంగ్ ను ఫిబ్రవరి 3 న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ పోస్టర్ లో దివ్యభారతి వెనుక సుధీర్ బ్యాగ్ లు మోస్తూ కనిపించాడు. చీరకట్టులో దివ్యభారతి ఆకట్టుకోగా సుధీర్ మాస్ లుక్ లో కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక సుధీర్ ఫ్యాన్స్.. మా సుధీర్ అన్నతోనే బ్యాగ్ లు మోయిస్తావా.. అయ్యో పాపం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో సుడిగాలి సుధీర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.