Subhasree Rayaguru: సమంత విడాకులు తీసుకొని ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Subhasree Rayaguru: ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్లకు కొదువే లేదు. తెలుగు తారలు పైకి రావడం తక్కువేమో కానీ ఇండస్ట్రీలోకి రోజుకో కొత్త హీరోయిన్ అడుగుపెడుతూ ఉంటుంది. ఇక తాజాగా రుద్రవీణ సినిమాతో ఫెమినా మిస్ ఇండియా ఒడిశా గా గెలిచిన శుభశ్రీ రాయగురు తెలుగు తెరకు పరిచయమవుతోంది. శ్రీరామ్ నిమ్మల హీరోగా మధుసూదన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచేసింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో హీరోయిన్ శుభశ్రీ, సమంత విడాకుల గురించి మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది. సమంత విడాకులు తీసుకొని మంచి పని చేసిందని, ఆమె ఎంతోమందికి ఆదర్శమని చెప్పి షాక్ ఇచ్చింది.
“సమంత నాకే కాదు చాలామంది అమ్మాయిలకు ఇన్స్పిరేషన్. విడాకుల తరువాత ఎన్ని విమర్శలు వచ్చినా స్ట్రాంగ్ గా నిలబడి పోరాడుతుంది. సామ్ నుంచి మనం చాలా నేర్చుకోవాలి.. ఒకపక్క సమస్యలతో పోరాడుతూనే కెరీర్ లో ముందుకు వెళ్తోంది. అవకాశం వస్తే ఆమెతో నటించాలని ఉంది”అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. సామ్ విడాకులు తీసుకోవడమే నచ్చలేదంటున్న అభిమానులకు శుభశ్రీ మాట్లాడిన మాటలు కొద్దిగా అసహనాన్ని కలిగిస్తున్నాయన్న మాట వాస్తవమే.. మరి ఈ వ్యాఖ్యలపై సామ్ అభిమానులు, సామ్ ట్రోలర్స్ ఏమంటారో చూడాలి.
Also Read
- RAAKA: ‘రాకా’ ఇంటర్వెల్ కోసం మైండ్ బ్లోయింగ్ స్టంట్స్.. బన్నీ ఫ్యాన్స్‌కు పండగే!
- Prabhas Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లోకి ప్రభాస్ రీ-ఎంట్రీ.. వైరల్ అవుతున్న షూటింగ్ అప్డేట్!
- RC 17 షురూ.. చిరంజీవి చేతుల మీదుగా చరణ్ కొత్త సినిమా ప్రారంభం!
- Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
SBI Credit Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ కొత్త బాదుడుపై ఒక లుక్ వేయండి!
-
Murasu Cyclone : ఏపీ వైపు మురసు తుఫాన్.. 120 కి.మీ. వేగంతో గాలులు
-
Rahul Gandhi: జ్ఞానేశ్ కుమార్ తర్వాత మోదీ వంతు.. రామ్‌లీలా మైదాన్‌లో రాహుల్ హెచ్చరిక!
-
Amit Shah: ‘‘మీరు అక్కడే ప్రధానిగా ఉండండి’’.. రాహుల్‌పై అమిత్ షా సెటైర్!
-
Mallikarjun Kharge: జ్ఞానేష్ కుమార్ ఎక్కడ దాక్కున్నా వదలం.. మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!