Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గానే ఉన్నాడు. మామూలు అమ్మాయిలే కాదు స్టార్ హీరోయిన్లకు ఆయనంటే క్రష్. మరి ఆరడుగుల బాహుబలి కదా. ఆ మాత్రం ఉండాల్సిందే. అయితే కొందరు స్టార్ హీరోయిన్లు ఏకంగా ప్రభాస్ నే పెళ్లి చేసుకుంటామని తెగేసి చెప్పారు. అప్పట్లో హీరోయిన్ కాజల్ ఇలాగే తన మనసులోని మాటను బయట పెట్టేసింది. మంచు లక్ష్మి హోస్ట్ గా చేసిన ఫేట్ అప్ విత్ స్టార్స్ ప్రోగ్రామ్ లో కాజల్ పాల్గొంది. రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లలో నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావ్ అని మంచు లక్ష్మీ ఓ క్వశ్చన్ వేసింది. కాజల్ నిర్మొహమాటంగా తాను ప్రభాస్ నే చేసుకుంటానని తెలిపింది. అప్పటికే ఎన్టీఆర్, చరణ్ కు పెళ్లి అయిపోయింది కాబట్టి బ్యాచిలర్ గా ఉన్న ప్రభాస్ నే సెలెక్ట్ చేసుకుంది.
Read Also : HHVM : వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగేది అక్కడే..
తమన్నా కూడా ఇదే బాట పట్టింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మిల్కీ బ్యూటీని మీరు ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటారా అని అడిగారు. తానే మాత్రమే కాదని.. అమ్మాయిలందరూ ప్రభాస్ నే పెళ్లి చేసుకోవాలని అనుకుంటారని చెప్పుకొచ్చింది. జాతిరత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా రీసెంట్ గా ఓ ప్రోగ్రామ్ లో తనకు ప్రభాస్ అంటే క్రష్ అని.. కుదిరితే పెళ్లి చేసుకుంటానని ఓపెన్ అయింది. రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ మీద ఇష్టాన్ని బయట పెట్టేసింది. పవన్ కల్యాణ్, ప్రభాస్ లో ఎవరితో డేట్ చేస్తారు, ఎవరిని పెళ్లి చేసుకుంటారు అని ప్రశ్నించగా.. తాను పవన్ తో డేట్ కు వెళ్లి ప్రభాస్ ను మ్యారేజ్ చేసుకుంటానని వెల్లడించింది. ఇలా హీరోయిన్లు ప్రభాస్ మీద ఉన్న ఇష్టాన్ని బయట పెట్టేశారు. ఇంత మంది పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నా.. ప్రభాస్ మాత్రం పెళ్లికి నో అంటూ సింగిల్ లైఫ్ సో బెటర్ అంటున్నాడు.
Read Also : K-Ramp : కె-ర్యాంప్ గ్లింప్స్ రిలీజ్.. నాటుగా దించేసిన కిరణ్ అబ్బవరం