Tollywood Star Heroine: అవార్డులా? మాకొద్దు.. డబ్బుంటే పంపండి.. స్టార్ హీరోయిన్ తండ్రి సంచలనం!
ఆమె ఒక స్టార్ హీరోయిన్. తెలుగులో దాదాపుగా అందరూ స్టార్ హీరోలతో నటించింది. అయితే ఇప్పుడు ఆమె తెలుగు సినిమాల మీద పెద్దగా ఫోకస్ చేయడం లేదు. బాలీవుడ్‌తో పాటు ఇతర భాషల సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఆమెకు ఒక అవార్డు ఇవ్వాలని ప్రతి ఏడాది అవార్డుల ఫంక్షన్ నిర్వహించే ఓ అవార్డుల ఈవెంట్ నిర్వాహకులు భావించారు. ఈ మేరకు ఆమె టీమ్‌తో సంప్రదింపులు జరపగా, ఆమె తండ్రి అందుబాటులోకి వచ్చారు.
“హైదరాబాదులో అవార్డుల ఈవెంట్ కార్యక్రమం జరుపుతున్నాం. మీ అమ్మాయికి ఒక అవార్డు ఇవ్వాలనుకుంటున్నాం. ఫలానా తేదీన హైదరాబాద్ వచ్చి అవార్డు అందుకోవాల్సిందిగా కోరుతున్నాం,” అని కోరగా.. అందుకు ఆయన ఆసక్తికరంగా, అనేకన్నా కొంత షాకింగ్‌గా రెస్పాండ్ అయ్యాడట. అదేమంటే, “ఇప్పటికే అవార్డులతో ఇల్లంతా నిండిపోయింది. ఆ అవార్డు బదులు ఏమైనా డబ్బులు ఇప్పించే ప్రయత్నం చేయండి,” అని సమాధానం ఇచ్చాడట. దీంతో షాక్ అవ్వడం ఈవెంట్ నిర్వాహకుల వంతు అయింది.
ఈ దెబ్బతో మళ్లీ ఆ స్టార్ హీరోయిన్‌కి అవార్డు పేరుతో ఫోన్ చేసే ప్రయత్నం చేయలేదని తెలుస్తోంది. అయితే ఇది ఇప్పటి విషయం కాదు, దాదాపు ఏడాది క్రితం విషయం అని తెలుస్తోంది.
Also Read
తాజావార్తలు
-
Tollywood Star Heroine: అవార్డులా? మాకొద్దు.. డబ్బుంటే పంపండి.. స్టార్ హీరోయిన్ తండ్రి సంచలనం!
-
Bhatti Vikramarka : ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యం
-
Tamil Nadu: విజయ్‌తో టచ్‌లోకి అన్నాడీఎంకే..
-
End of Left Rule: దేశ రాజకీయాల్లో ఒక శకం ముగింపు.. కనుమరుగవనున్న ఎర్రజెండా?
-
Ashu Reddy: అంతా ఆయన ఇష్టపూర్వకంగా ఖర్చు చేసిందే.. హైకోర్టులో అషు రెడ్డి సంచలనం!
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!