కాంతారా కన్నడ సినిమా చరిత్రలో ఒక సెన్సేషన్. కన్నడ యంగ్ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ నటించిన ఈ సినిమా కన్నడ ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. ఈ సినిమాను జస్ట్ రూ. 16 కోట్లతో తీస్తే సుమారు రూ. 450 క్రోర్ కలెక్షన్లను రాబట్టుకొంది. తెలుగు, తమిళ్, హిందీ చిత్ర పరిశ్రమలలో రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టింది. ఇప్పడు కాంతారా కు ప్రీక్వెల్ గా కాంతారా చాఫ్టర్ 1 ను తీసుకువస్తున్నారు. అందుకు హోంబలే భారీగా ఖర్చు పెడుతోంది.
Also Read : Ghaati : షూటీ డే – 1 కలెక్షన్స్.. బయ్యర్స్ కి ఘాటు పడింది.
ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసారు. ఈ ఏడాది గాంధీ జయంతి నాడు అనగా అక్టోబరు 2న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. అందుకు సంబందించి పోస్టర్ ను కూడా రిలీజ్ చేసారు మేకర్స్. మరోవైపు ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు స్టేట్స్ కు దాదాపు రూ. 100 కోట్ల ధర పలుకుతోంది. ఇదిలా ఉండగా కాంతారా మలయాళం రైట్స్ ను కేరళ స్టార్ హీరో పృద్వి రాజ్ సుకుమారన్ దక్కించుకున్నారు. పృద్విరాజ్ కు చెందిన పృద్విరాజ్ ప్రొడక్షన్స్ ద్వారా రిలీజ్ అవుతోంది. మరోవైపు ఆడియన్స్‌కి ఎక్స్‌ట్రాడినరీ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేందుకు రెడీ చేస్తున్నాడు రిషబ్ శెట్టి. ఈ సినిమా కోసం రిషబ్ శెట్టి కూడా గుర్రపు స్వారీ, కత్తి యుద్దం, పురాతన యుద్ద కళైన కలరియపట్టు వంటి వాటిలో శిక్షణ కూడా తీసుకున్నాడు. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన కాంతారా భారీ విజయం సాదించాడంతో రాబోతున్న చాఫ్టర్ 1 పై భారీ అంచనాలు ఉన్నాయి.