Heroines: దూకుడు సినిమాలో బ్రహ్మానందం చెప్పిన డైలాగ్ గుర్తుందా.. ఇది యాపారం అని డబ్బే తనకు ముఖ్యం అని చెప్తాడు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ల పెళ్లిళ్లు అలానే ఉన్నాయి. ప్రేమతో మొదలై పెళ్లితో ముగిసే అందమైన జ్ఞాపకాలను ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ముఖ్యంగా అమ్మాయిలకు పెళ్లి విషయంలో ఎన్నో కలలు, కోరికలు ఉంటాయి. వాటికోసం అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. డబ్బు ఎంత అయినా ఖర్చు అవ్వని.. తమ జ్ఞాపకాలు పదిలంగా ఉండాలని కోరుకుంటారు. అయితే ఆ పెళ్లినే వ్యాపారం చేసేస్తున్నారు స్టార్ హీరోయిన్లు. తమ పెళ్ళికి ఎంత అయితే ఖర్చు అయ్యిందో.. అంతకు పదిరెట్లు పొందుతున్నారు. ఎలా అనేగా సందేహం చెప్తా.. ఒకప్పుడు స్టార్ హీరోల, హీరోయిన్ల పెళ్లిళ్లు అంటే ప్రముఖులతో పాటు అభిమానులను కూడా పిలిచేవారు. వారందరికీ వడ్డించి, మంచి గిఫ్టులు ఇచ్చి వధూవరులను ఆశీర్వదించాకా పంపించేవారు.
హీరో రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ పెళ్లిళ్లు అలానే జరిగాయి. లక్షలాది మంది అభిమానుల మధ్య జరిగిన ఆ పెళ్లిళ్ల గురించి అక్కడ పెట్టిన విందు గురించి ఇప్పటికి మాట్లాడుకుంటారు. కానీ, రోజురోజుకు ట్రెండ్ మారిపోతోంది. ఇప్పుడు ఎంత తక్కువమందిని పిలిస్తే అంత గొప్ప.. ఎంత సీక్రెట్ గా పెళ్లి చేసుకొంటే అంత డబ్బు అన్న చందాన తయారయ్యారు. తమ అభిమాన హీరో, హీరోయిన్ పెళ్లి చేసుకొంటుంటే చూడాలని ఆశపడే అభిమానులు లెక్కలేని మంది. ఇప్పుడు ఆ ఆశనే వారు క్యాష్ చేసుకుంటున్నారు. అదే ఎలా అంటే.. స్టార్ హీరోయిన్ల పెళ్లిని కొన్ని ప్రముఖ ఓటిటీ ఛానెల్స్ కొనుగోలు చేస్తాయి.. వధూవరులు ఇంటిదగ్గర బయల్దేరిన దగ్గరనుంచి పెళ్లి అయ్యి మళ్లీ ఇంటికి వచ్చేవరకు ఆ ఓటిటీకి సంబంధించిన వారే ఆ పెళ్లిని రికార్డ్ చేస్తారు. ఆ పెళ్లిని వారి ఓటిటీలో ఎప్పుడు కావాలంటే అప్పుడు స్ట్రీమింగ్ చేస్తారు. ఇక మన స్టార్ల పెళ్లిళ్లు.. మనం మన ఇంట్లో కూర్చొని ఓటిటీలో చూడొచ్చు అన్నమాట.. అందుకు ఓటిటీ మేకర్స్, స్టార్ల మధ్య బిగ్ డీల్స్ కుదుర్చుకుంటారు.
ప్రియాంక చోప్రా – నిక్ జోనాస్ ఈ ట్రెండ్ కు ఆద్యం పోశారు. వీరి పెళ్లి ఫుటేజీని పాపులర్ అంతర్జాతీయ మ్యాగజైన్ కు 18 కోట్ల రూపాయలకు అమ్మారు. ఆ తరువాత పీసీని ఫాలో అయిన హీరోయిన్ దీపికా పదుకొనే. రణవీర్ ను ప్రేమించి పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ తమ పెళ్లి ఫుటేజ్ ను భారీ మొత్తానికి ఓ కంపెనీకి విక్రయించింది. ఇక వీరి తరువాత కత్రీనా, నయన్, అలియా, హన్సిక, తాజాగా మొన్న పెళ్లాడిన కియారా.. వీరందరూ తమ తమ పెళ్లిని బిజినెస్ స్ట్రాటజీగా మార్చేసుకున్నారు. ఇందుకోసమే ప్రముఖులను తప్ప బయట వారిని పిలవకుండా ఎంతో జాగ్రత్తగా ఎటువంటి లీక్స్ లేకుండా పెళ్లి చేసుకొని తమ పెళ్లి ఫుటేజ్ లను ఓటిటీలకు అమ్మి కోట్లు గడిస్తున్నారు. ఇక ఇందులో కూడా చాలా కండిషన్స్ ఉన్నాయి. ఓటిటీ నిర్వాహకులకు తెలియకుండా ఫొటోస్ కానీ, వీడియోలు కానీ లీక్ చేయకూడదు. వారికి తెలియకుండా తమ పెళ్లి వీడియోస్ ను వేరేవారికి ఇవ్వకూడదు. ఈ కండిషన్స్ మీరితే.. తీసుకున్న డబ్బులు వెనక్కి ఇవాల్సివచ్చే ప్రమాదముంది. అందుకే తారలు ఎంతో జాగ్రత్తగా యాపారాలు అదేనండీ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మరి ముందు ముందు ఈ ట్రెండ్ ను ఇంకే హీరోయిన్లు పాటిస్తారో చూడాలి.