స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా ప్రేమ కథలకు మాస్టర్ గా పిలవబడే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘ జాక్’. బేబి బ్యూటీ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది. డీజే టిల్లు వంటి సూపర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావండంతో ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. చాలా కాలంగా షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ట్రైలర్ ను కొద్దిసేపటి క్రితం విడుదల చేసారు మేకర్స్.
సిద్దు నుండి ప్రేక్షకులు ఎటుంవంటి కంటెంట్ అయితే ఆ విధంగా ట్రైలర్ ను కట్ చేసారు మేకర్స్. బొమ్మరిల్లు భాస్కర్ టేకింగ్ బాగుంది. ఈ సారి కేవలం వినోదం మాత్రమే కాకుండా కథ కూడా బలంగా ఉన్నట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. స్పై టైప్ కంటెంట్ కు డీజే టిల్లు లాంటి కామెడీని జోడించాడు దర్శకుడు భాస్కర్. మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు రాజమణి చాలా కాలం తర్వాత తెలుగులో చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ కు అందించిన నేపధ్య సంగీతం బాగుంది. హీరోయిన్ వైష్ణవి చైతన్యకు మంచి రోల్ పడినట్టు ఉంది. ట్రైలర్ చివరలో వచ్చిన లాంగ్ షాట్ అదింరింది. సిద్దు మార్క్ పంచ్ లతో అదరగొట్టాడు. ఓవరాల్ గా టైటిల్ కు తగ్గట్టు ‘జాక్ కొంచం కాదు కావాల్సినంత క్రాక్’ అనేలా ఉందనే చెప్పాలి. SVCC బ్యానర్ పై భోగవల్లి బాపినీడు నిర్మిస్తున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతుంది.