SSMB29: రాజమౌళి – మహేశ్ బాబు మూవీ.. నా జీవితాన్ని కచ్చితంగా మార్చేస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన కెరీర్లో కొత్త శకాన్ని ప్రారంభించబోతోంది. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ ‘గ్లోబ్‌ట్రాటర్ (SSMB29)’లో ప్రియాంక కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె మందాకిని పాత్రలో కనిపించబోతోంది. నవంబర్ 12న ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కాగా, పోస్టర్ రిలీజ్‌కి ముందు ప్రియాంక తన అభిమానులతో ఎక్స్ (మునుపటి ట్విట్టర్)లో చాట్ చేస్తూ ఆసక్తికర విషయాలు పంచుకుంది.
Also Read : Globetrotter-event : గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ కోసం వచ్చే అభిమానులకు.. రాజమౌళి సూచనలు
Also Read
- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
- Anumana Pakshi: ‘డీజే టిల్లు’ దర్శకుడి మరో కొత్త కామెడీ.. ‘అనుమాన పక్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్
- Rashmika Mandanna : ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో 'రష్మిక మందన్న'
- Bhogi: ‘భోగి’ రక్షాబంధన్ పోస్టర్ బ్లాస్ట్.. అదిరిపోయిన శర్వానంద్ లుక్
భారతీయ సినిమాల్లో తిరిగి ఎంట్రీ ఇవ్వడం చాలా స్పెషల్‌గా అనిపిస్తోందని ప్రియాంక చెప్పింది. ఒక అభిమాని “ఇది మీ కొత్త యుగమా?” అని అడగగా, ఆమె స్పందిస్తూ “ఆశాజనకంగా ఇది భారతీయ సినిమాల్లోకి నా రీఎంట్రీ అవుతుంది. నాకు కచ్చితంగా తెలియదు కానీ ఇది అద్భుతంగా ఉంటుంది” అని చెప్పింది. రాజమౌళితో పని చేయడం కష్టమా అని అడిగినప్పుడు, “రెండూ కష్టం కాదు కానీ రెండూ జీవితాన్ని మార్చేవి” అంటూ ఆమె సరదాగా సమాధానమిచ్చింది.
సినిమా కోసం తెలుగు నేర్చుకుంటున్నానని, డైలాగులు నేనే చెప్పబోతున్నానని ప్రియాంక తెలిపింది. “రాజమౌళి చాలా సహాయం చేస్తున్నారు. నేను నా తెలుగు డైలాగులు నేర్చుకుంటున్నాను. మీ అంచనాలకు అందుతాను” అని చెప్పింది. హైదరాబాద్ బిర్యానీ గురించి మాట్లాడుతూ “ప్రపంచంలోనే బెస్ట్ బిర్యానీ అదే!” అని ప్రియాంక చెప్పారు.
రాజమౌళి–మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ కోసం అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. నవంబర్ 15న హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేశారు మేకర్స్. ఆ ఈవెంట్ జియోహాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ఆ రోజే సినిమా టైటిల్, మహేష్ బాబు ఫస్ట్ లుక్ రివీల్ చేసే అవకాశం ఉందని సమాచారం.
తాజావార్తలు
-
Joe Root: రిక్కీ పాంటింగ్ రికార్డు చెల్లాచెదురు.. జో రూట్ అరుదైన ఘనత..
-
Dasara: క్రేజీ హీరోస్ అందరూ మూకుమ్మడిగా దసరా పండగకే ?
-
Nikitha Godishala: యూఎస్ లో మాజీ ప్రియురాలి హత్య కేసు.. ఆగ్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
-
Geetu Mohandas : అసలు ఏం చెప్పాలనుకుంది? ఏం చెప్పింది?
-
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!