SS Rajamouli: ‘బాహుబలి’, ‘RRR’ కాదు.. రాజమౌళి బెస్ట్ మూవీ ఇదేనట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SS Rajamouli: బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకధీరుడు రాజమౌళి. సాధారణంగా ఎవరైనా సరే ఈ సినిమాలతో ప్రపంచ స్థాయి గుర్తింపును సొంతం చేసుకుంటే అందులో ఏదో ఒకటి తన సినిమాల్లో బెస్ట్ మూవీ అని అనుకుంటారు. కానీ జక్కన్న సినిమా స్టైలే వేరు. రాజమౌళి తెరకెక్కించిన సినిమాల్లో ఎన్నో ఇండస్ట్రీ హిట్లు ఉన్నప్పటికీ, తనకు మాత్రం ‘ఈగ’ చిత్రమే అత్యంత ఇష్టమైన సినిమా అని ఆయన మరోసారి స్పష్టం చేశారు. “ఈగ ఈజ్ మై బెస్ట్ ఫిల్మ్.. ఇట్స్ మై పర్సనల్ ఫేవరెట్” అంటూ రాజమౌళి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి ప్రపంచవ్యాప్త విజయాలు సాధించిన చిత్రాల కంటే కూడా ‘ఈగ’కే ఆయన ప్రత్యేక స్థానం ఇవ్వడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఈ కామెంట్స్‌తో పాటు రాజమౌళి తన దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’ గురించి కూడా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అడ్వెంచర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా కథ ప్రేక్షకులను ప్రపంచవ్యాప్తంగా ఓ అద్భుతమైన ప్రయాణానికి తీసుకెళ్తుందని ఆయన చెప్పారు. సినిమా కథ వారణాసిలో ప్రారంభమై అక్కడి నుంచి మంచుతో కప్పుకున్న అంటార్కిటికా వరకు, అనంతరం ఆఫ్రికా ఖండానికి చేరుకుంటుంది. ఆ తర్వాత కాలంలో వెనక్కి ప్రయాణిస్తూ ప్రాచీన రోమ్ సామ్రాజ్యాన్ని తాకి.. చివరికి మళ్లీ వారణాసికే చేరుకునే విధంగా కథను రూపొందించినట్లు తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. 2027 ఏప్రిల్ 7న వారణాసిని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
Also Read
- Allu Arjun: బన్నీ ఫోకస్ మారిందా! పొరుగు హీరోలు తిరస్కరించిన కథలకే అల్లు అర్జున్ ఓకే చెబుతున్నాడా?
- Donga Naa Koduku: జాగ్రత్త.. 'దొంగ నా కొడుకు' వస్తున్నాడు! ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ చూశారా..
- Nani - Nithiin: 20 ఏళ్లలో ఎంత మార్పు.. ఒకప్పుడు నితిన్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్.. ఇప్పుడు అదే హీరోకు నిర్మాతగా!
- NTR: త్వరలోనే సెట్స్‌లోకి ఎన్టీఆర్.. అప్పటివరకు 'డ్రాగన్' టీమ్ ఫుల్ బిజీ!
తాజావార్తలు
-
Accident : స్కూల్ ఆటోను ఢీకొట్టిన లారీ, 10 మంది విద్యార్థులకు గాయాలు
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
-
Bankipur Results: 30 ఏళ్ల బీజేపీ కంచుకోట బద్దలు.. బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం
-
AP Weather Alert: రానున్న 3 గంటలు జాగ్రత్త.. పిడుగులతో వర్షాలపై APSDMA హెచ్చరిక.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
-
Allu Arjun: బన్నీ ఫోకస్ మారిందా! పొరుగు హీరోలు తిరస్కరించిన కథలకే అల్లు అర్జున్ ఓకే చెబుతున్నాడా?
ట్రెండింగ్
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!
-
Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే ‘మష్రూమ్ ఆనియన్ పకోడీ’.! చేసేయండి ఇలా..