సెలబ్రిటీలు అంటే అందరికీ ఒకే అభిప్రాయం ఉంటుంది. కోట్ల రూపాయలు సంపాదిస్తారు, లగ్జరీ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తారు, ఖరీదైన కార్లు, బంగ్లాలు కొంటారు. నిజానికి చాలా స్టార్‌లు కూడా అలానే ఉంటారు. మార్కెట్లోకి వచ్చిన కొత్త లగ్జరీ కార్లను ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తారు. కోట్ల రూపాయల విల్లాలు, ఫారిన్ ప్రాపర్టీస్, బ్రాండ్‌డ్ వస్తువులు ఇవన్నీ వారి లైఫ్‌లో భాగమే. కానీ అందరికీ ఒకే ఫార్ములా ఉండదు! విశ్వనటుడు కమల్ హాసన్ మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటారట.
Also Read : Govinda Divorce : గోవిందా విడాకుల రూమర్స్‌పై క్లారిటీ..
ఆయన ఖరీదైన కార్లు కొనరు. విల్లాలు, ఫారిన్ ప్రాపర్టీస్ జోలికే వెళ్లరట. ఈ విషయాన్ని ఆయన కుమార్తె శ్రుతి హాసన్ తాజాగా రివీల్ చేసింది. ఆమె చెప్పిన దానీ ప్రకారం.. ‘నాన్నకి తెలిసినది ఒకటే – కొత్త కాన్సెప్ట్‌తో వచ్చే సినిమాల్లో పెట్టుబడి పెట్టడం. టెక్నికల్ క్వాలిటీ ఉన్న కథలు అంటే ఆయనకు చాలా ఇష్టం. వాటికి అవసరమైన డబ్బు ఖర్చు చేయడంలో ఆయన ఎప్పుడూ వెనుకడుగు వేయరు. ఎందుకంటే నాన్నకు డబ్బు శాశ్వతం కాదన్న నమ్మకం ఉంది. సినిమాల ద్వారా సంపాదించిన దానికంటే పోగొట్టుకున్నదే ఎక్కువ. కానీ ఇంట్లో చాలా సింపుల్ లైఫ్‌స్టైల్ ఇష్టపడతారు. ఖరీదైన వస్తువుల పై ఆయనకు అసలు ఆసక్తి ఉండదు. విల్లాలు, భూములు, ఫారిన్ ప్రాపర్టీస్ ఏవీ ఆకర్షణీయంగా అనిపించవు. బదులుగా, టెక్నాలజీకి సంబంధించిన కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎక్కువ ఆసక్తి చూపుతారు. అలాగే కొత్త ఐడియాస్, సబ్జెక్ట్స్ ఉన్న డైరెక్టర్స్‌ను ప్రోత్సహించడం ఆయనకు ప్యాషన్’ అని శ్రుతి హాసన్ తెలిపింది. అంటే ఇండస్ట్రీలో చాలా మంది స్టార్‌లు సంపాదనతో పాటు స్థిరాస్తులు కూడబెట్టుకుంటుంటే, కమల్ మాత్రం సినిమాల మీద ప్యాషన్ కోసం సంపాదన అంతా ఖర్చు చేసే వ్యక్తి అని చెప్పవచ్చు.