SRK Vs Prabhas: డైనోసర్ vs కింగ్ ఖాన్… ఈ క్లాష్ లో గెలిచినోడు ఇండియన్ సినిమాకి కింగ్ అవుతాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ రెండు వెయ్యి కోట్ల సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఏ ఇండియన్ హీరోకి కలలో కూడా సాధ్యం కానీ రేర్ ఫీట్ ని సొంతం చేసుకున్న షారుఖ్ ఖాన్… ఒకే ఏడాదిలో మూడో వెయ్యి కోట్ల సినిమాని సాధించడానికి రాజ్ కుమార్ హిరానీతో కలిసి ‘డుంకి’ సినిమా చేస్తున్నాడు. ఈ ఏడాది డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీపై బాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. పఠాన్, జవాన్ కాదు డుంకి అసలైన షారుఖ్ సినిమా. ఆ మూవీ క్రియేట్ చేయబోయే సెన్సేషన్ ఎలా ఉండబోతుందో చూడండి అంటూ బాలీవుడ్ మీడియా కూడా డుంకి సినిమా గురించి హైప్ పెంచుతుంది. అయితే ఇప్పుడు డుంకి సినిమాకి, కింగ్ ఖాన్ షారుఖ్ కి షాక్ ఇస్తూ డైనోసర్ లైన్ లోకి వచ్చింది. సెప్టెంబర్ 28 నుంచి వాయిదా పడిన సలార్ సినిమా కొత్త రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తూనే ఉన్నారు. లేటెస్ట్ గా అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సలార్ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ కానుందట. ఇది పక్కా అయితే డుంకి సినిమాకి సలార్ కి బాక్సాఫీస్ వార్ భారీగా జరగడం గ్యారెంటీ. ఈ వార్ ఏ రేంజులో ఉండబోతుందో ఊహించి చెప్పడం కూడా కష్టమే. ఇంకా కరెక్ట్ గా చెప్పాలి అంటే సలార్, డుంకి సినిమాలు డిసెంబర్ 22నే రిలీజ్ అవుతాయా అంటే ఆ టైంకి ఎదో ఒకటి వాయిదా పడడం గ్యారెంటీగా కనిపిస్తోంది.
ఎందుకంటే ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ఒకే డేట్ కి సినిమాలని రిలీజ్ చేస్తే థియేటర్స్ విషయం నుంచి ప్రతి మ్యాటర్ లో ఎదో ఒక సినిమాకి అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా ఒకప్పుడు షారుఖ్ ఖాన్ ఉన్న ఫామ్ కి ఇప్పుడున్న ఫామ్ కి చాలా తేడా ఉంది. పఠాన్ కి ముందు అయితే షారుఖ్ వీక్ గా ఉన్నాడు కాబట్టి తనపై పోటీగా సినిమాని వదిలినా ఆడియన్స్ పెద్దగా కన్ఫ్యుస్ అయ్యే వారు కాదు కానీ ఇప్పుడు అలా కాదు షారుఖ్ ఖాన్ సూపర్బ్ ఫామ్ లో ఉన్నాడు. నార్త్ ఆడియన్స్ అండ్ ఓవర్సీస్ ఆడియన్స్ డుంకి సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సింపుల్ గా చెప్పాలి అంటే సలార్ సినిమాకి పర్ఫెక్ట్ పోటీ దొరికింది. ఇద్దరూ వెనక్కి తగ్గకుండా సలార్-డుంకి సినిమాలని రిలీజ్ చేస్తే ఇండియన్ బాక్సాఫీస్ ఒక్క వారం రోజుల్లోనే రెండు వేల కోట్ల కలెక్షన్స్ ని చూస్తుంది. ఈ క్లాష్ లాక్ అయితే ఈ వార్ లో గెలిచే వాళ్లే ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ గా నిలుస్తారు.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
తాజావార్తలు
-
Mohammad Kaif: రోహిత్, కోహ్లీ కాదు.. 2027 వరల్డ్ కప్ గెలవాలంటే భారత్‌కు ఇదే కీలకం..
-
APPSC: నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీపీఎస్సీ నుంచి 5 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల..
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?