40 ఏళ్ళ ‘శ్రీరస్తు-శుభమస్తు’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘శ్రీరస్తు… శుభమస్తు…’ అన్న పదాలు మనవాళ్ళకు మహదానందం కలిగిస్తాయి. ముఖ్యంగా శుభలేఖల్లోనూ ఈ పదాలు ప్రధానస్థానం ఆక్రమిస్తుంటాయి. శుభకార్యాల్లోనూ ఈ పదాలే జనానికి ఆనందం పంచుతూ ఉంటాయి. ‘శ్రీరస్తు-శుభమస్తు’ టైటిల్ తో చిరంజీవి హీరోగా రూపొందిన చిత్రం 1981 సెప్టెంబర్ 26న విడుదలయింది. కట్టా సుబ్బారావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం యువతను అప్పట్లో ఆకట్టుకుంది. ఇదే టైటిల్ తో ఈ మధ్య చిరంజీవి మేనల్లుడు అల్లు శిరీష్ హీరోగా ఓ చిత్రం రూపొందింది.
‘శ్రీరస్తు-శుభమస్తు’ కథలో కృష్ణ, కాళిదాస్ మంచి మిత్రులు. కృష్ణకు ఆడదంటే ఆటవస్తువు. దాసు అందుకు విరుద్ధం స్త్రీని పూజించాలి, గౌరవించాలి అంటూ ఉంటాడు. కాళిదాస్ కు దేవి అనే అమ్మాయి అంటే ఆరాధన. అదే అమ్మాయిని మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకుంటానని సవాల్ చేస్తాడు కృష్ణ. దేవిని నమ్మించి మోసం చేస్తాడు. మరోవైపు మేనమామ కూతురు సుందరితో రొమాన్స్ చేస్తుంటాడు కృష్ణ. అయితే దేవి మాత్రం కృష్ణ ఉండే ఆఫీసుకు వెళ్ళి తానే ఆయన భార్యనని చెబుతుంది. అంతటితో ఆగకుండా కృష్ణ ఉండే గదికి వెళ్ళి, భార్యగా కాపురం చేస్తానంటుంది. మేనమామకు అసలు విషయం తెలిసి కృష్ణను గెంటేస్తాడు. దాంతో ఊరుకోకుండా మరో ధనవంతుని కూతురు కల్పనకు గేలం వేస్తాడు కృష్ణ. పెళ్ళి చేసుకోవాలనకుంటాడు. అయితే కల్పన తెలివిగా మరో అమ్మాయిని పీటల మీదకు పంపుతుంది. అది చూసి అగ్గిమీద గుగ్గిలమవుతాడు కృష్ణ. తరువాత కృష్ణ ఉద్యోగం పోతుంది. వీధిన పడతాడు. ఆ సమయంలో దేవి ఆదుకోవాలని వస్తుంది. తిరస్కరిస్తాడు. చివరకు పశ్చాత్తాపం చెంది, దేవిని కృష్ణ ఆదరించడంతో కథ సుఖాంతమవుతుంది.
Also Read
ఈ చిత్రంలో చిరంజీవి సరసన సరిత, కవిత నాయికలు కాగా, నూతన్ ప్రసాద్, సువర్ణ, అత్తిలి లక్ష్మి, పి.ఎల్.నారాయణ, జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి, చిట్టిబాబు, రమణమూర్తి, ప్రభాకర్ రెడ్డి నటించారు. ఈ చిత్రానికి వీటూరి మాటలు, వేటూరి పాటలు, జె.వి.రాఘవులు సంగీతం సమకూర్చారు. శ్రీ ఆలయమ్మన్ క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది. ఇందులోని “శ్రీరస్తు శుభమస్తు శ్రీవారికీ… కళ్యాణమస్తు మా ఇద్దరి ముద్దులకి…” సాంగ్ బాగా ఆకట్టుకుంది. “కోమలాంగి వచ్చిందిరో…మెచ్చిందిరో.. నచ్చిందిరో…”, “శ్రీదేవి నా దేవి కరుణ చూపవా…”, “నవ్విస్తాడే కవ్విస్తాడే మురిపాలెన్నో కురిపిస్తాడే…” పాటలు కూడా అలరించాయి. అంతకు ముందు ‘న్యాయం కావాలి’, ’47 రోజులు’ వంటి చిత్రాలలో హీరోయిన్ ను మోసం చేసే పాత్రల్లో నటించిన చిరంజీవితో మరోమారు అలాంటి పాత్రలోనే చూపింది ఈ చిత్రం.
తాజావార్తలు
-
Tollywood 2026 First Half: సోసోగా ఫస్ట్ హాఫ్ ..ఆశలన్నీ సెకండాఫ్ మీదే?
-
Kitchen Tips: ఉడికించిన బంగాళాదుంపల తొక్క తీసేటప్పుడు చేతులు కాలుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్‌తో క్షణాల్లో తొక్క ఊడిపోతుంది!
-
Karthi: కార్తి బర్త్‌డే ట్రీట్.. సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి బిగ్ అనౌన్స్మెంట్
-
KTR: వాటిని చూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా.. కేటీఆర్ హాట్ కామెంట్స్.!
-
Ajinkya Rahane Captaincy: కేకేఆర్ కెప్టెన్సీ వదిలేయాలనిపించలేదా?.. ఆజింక్య రహానే ఆసక్తికర సమాధానం ఇదే!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!