Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’కు సెన్సార్ క్లియరెన్స్.. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం!
- జయకృష్ణ డెబ్యూ చిత్రం 'శ్రీనివాస మంగాపురం'
- జులై 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్
- శ్రీనివాస మంగాపురంకు సెన్సార్ క్లియరెన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. జయకృష్ణ నటించిన డెబ్యూ చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ విడుదలకు సిద్ధమైంది. దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ లవ్ స్టోరీకి తాజాగా సెన్సార్ బోర్డు ‘U/A’ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారిక పోస్టర్ ద్వారా ప్రకటించింది. ఇక సినిమా జులై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ చిత్రంలో బాలీవుడ్ యువ నటి రషా థడానీ హీరోయిన్గా నటిస్తుండగా.. ప్రముఖ నటుడు మోహన్‌బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్‌పై జెమిని కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేమ, భావోద్వేగాలు, యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. ‘ఆర్ఎక్స్ 100’, ‘మహా సముద్రం’, ‘మంగళవారం’ వంటి విభిన్న చిత్రాలతో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు అజయ్ భూపతి.. ఈసారి మరో భావోద్వేగభరిత ప్రేమకథను తెరపైకి తీసుకువస్తున్నారు.
Also Read
- Shambo Shiva Shambo Re Release: 'ఫ్రెండ్షిప్ డే' స్పెషల్‌గా 4Kలో 'శంభో శివ శంభో'.. ట్రైలర్, రిలీజ్ డేట్ డీటెయిల్స్ ఇవే!
- Ramayana Trailer: చివరి నిమిషంలో ‘రామాయణ’ ట్రైలర్ వాయిదా.. అసలు కారణం ఏంటంటే?
- Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
- Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
తాజాగా విడుదలైన పోస్టర్లో హీరో-హీరోయిన్ల మధ్య ఉన్న కెమిస్ట్రీ ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే సినిమా ప్రమోషన్లు ఊపందుకోగా.. సెన్సార్ పూర్తి కావడంతో విడుదల ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. జయకృష్ణ ఎలాంటి విజయాన్ని అందుకుంటారనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. శ్రీనివాస మంగాపురం ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’కు సెన్సార్ క్లియరెన్స్.. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం!
-
Google Security: పాస్వర్డ్ మరిచిపోయారా?.. ఇకపై ఒక్క ‘సెల్ఫీ వీడియో’తో అకౌంట్ రికవర్!
-
Supreme Court: నీట్ లీకేజీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.. కేంద్రం, NTAకు న్యాయస్థానం కీలక ఆదేశాలు..
-
Delhi Police: విద్యార్థి ఆందోళనల ఎఫెక్ట్.. పోలీసులందరి సెలవులు రద్దు..
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్‌లు కూడా.!