Srikanth: టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ ప్రస్తుతం విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇక శ్రీకాంత్ కు మెగాస్టార్ చిరంజీవి సొంత అన్నయ్యలా ఉంటారన్న విషయం అందరికి తెల్సిందే. వీరిద్దరూ కలిసి శంకర్ దాదాMbbs కలిసి నటించారు. అంతేకాకుండా చిరు ఎక్కడ ఉంటే శ్రీకాంత్ అక్కడ ఉంటాడు. ఇక తాజాగా ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి తో పాటు శ్రీకాంత్ కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఫస్ట్ డే ఫస్ట్ షో మూమెంట్ ను పంచుకున్నాడు.
” మొదటి నుంచి నేను చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్.. ఆయన సినిమా వచ్చిందంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడకుండా ఉండలేను. ముఖ్యంగా వేట సినిమా సమయంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అప్పట్లో ఎక్కువ రష్ ఉండేది. ఇప్పుడిలా ఆన్ లైన్ లో టికెట్స్ లేవు. దీంతో 5 గంటలకు షో అయితే.. 3 గంటలకే సైకిల్ వేసుకొని థియేటర్ వద్ద ఎదురుచూసేవాళ్లం. ఆ సమయంలో పోలీసులు వచ్చేశారు. ఇక లాఠీ ఛార్జ్ మొదలు.. అలా చిరంజీవి అన్న సినిమా కోసం దెబ్బలు కూడా తిన్నాను. బాగా గట్టిగా కొట్టారు. అయినా టికెట్ తీసుకొని సినిమా చూశాను. అలా చాలా సార్లు జరిగింది. ఇప్పుడు ఈ విషయాలను అన్నయ్య ముందు పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది” అని చెప్పుకొచ్చారు.