Peddha Kapu-1 Theatrical Release On September 29th: సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ప్రస్తుతం న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ పెదకాపు-1ని డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘అఖండ’ లాంటి మాసీవ్ బ్లాక్ బస్టర్ ని అందించిన ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో విరాట్ కర్ణ హీరోగా పరిచయం అవుతున్నారు. ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్ గా నటించిన ఈ పెదకాపు-1ని సెప్టెంబర్ 29న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఈరోజు అనౌన్స్ చేశారు. సలార్ సినిమా సెప్టెంమర్ 28న రిలీజ్ కావడం లేదని క్లారిటీ రావడంతో ఇప్పటికే మ్యాడ్, రూల్స్ రంజన్ సినిమాలు అదే రోజున రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఇక ఇప్పుడు స్కంద సినిమాను కూడా అదే డేటుకు రిలీయేజ్ చేస్తున్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో పెదకాపు-1ని రంగంలోకి దించుతున్నారు. దసరా పండుగ సందర్భంగా భారీ పోటీ ఉండటంతో ఇది పర్ఫెక్ట్ డేట్ అని యూనిట్ భావిస్తోంది.
Samantha: మేనేజర్ మోసం.. తాడోపేడో తేల్చుకునేందుకు ల్యాండైన సమంత?
సోమవారం గాంధీ జయంతి సెలవు సినిమాకి అడ్వాంటేజ్ గా ఉంటుందని అంటున్నారు. ఇక ఈ రిలీజ్ డేట్ పోస్టర్‌లో విరాట్ యాక్షన్ ప్యాక్డ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ యాక్షన్ సీక్వెన్స్‌లో హీరో, మిగతావారు చేతిలో ఆయుధాలతో కనిపించారు, ఇంతకుముందు విడుదల చేసిన టీజర్, పాటలకు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో రానున్న రోజుల్లో ప్రమోషన్స్ మరింత ముమ్మరం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. పెదకాపు-1 అణచివేత, ఘర్షణల నేపథ్యంలో రూపొందిన సినిమా అని అంటున్నారు. ఈ సినిమాకి ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పిస్తున్న ఈ సినిమాకి మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, పీటర్ హెయిన్స్ ఫైట్స్‌ను పర్యవేక్షిస్తున్నారు. విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవలతో పాటు రావు రమేష్, నాగబాబు, తనికెళ్ల భరణి, బ్రిగడ సాగ, రాజీవ్ కనకాల, అనుసూయ, ఈశ్వరి రావు, నరేన్ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు