Samantha Returns india from USA:పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సమంత ఎట్టకేలకు ఖుషి సినిమాతో హిట్ అందుకోవడమే కాక మరోసారి అమెరికాలో మిలియన్ డాలర్ల సినిమా అందుకుంది, దీంతో ఆమె ఇప్పుడు మంచి జోష్ లో ఉంది. వాస్తవానికి ఆమె సినిమా రిలీజ్ కి కొద్ది రోజుల ముందు అమెరికా పయనం అయింది. ఇండియాలో ఖుషి లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ ముగిసిందా లేదో తన తల్లిని తీసుకుని అమెరికా వెళ్ళిపోయింది సమంత. అక్కడ ఆమె మయోసైటిస్ కోసం చికిత్స తీసుకుంటుందని ఏడాది సినిమాలకు బ్రేక్ ఇవ్వడంతో ఏడాది మొత్తం అక్కడే గడుపుతుందని మీడియాకు లీకులు కూడా అందాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అమెరికా వెళ్ళిన సమంత అక్కడ చికిత్స తీసుకుందో లేదో తెలియదు కానీ ఖుషి సినిమాని అక్కడ గట్టిగా ప్రమోట్ చేసింది. అసలు ఇండియాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించకపోగా అమెరికాలో మాత్రం సమంతతో చిన్నపాటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిపించారు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు. సినిమా రిలీజ్ అయిపోయింది యూనిట్ అంతా మంచి జోష్లో ఉంది. ఇక సమంత చికిత్స కోసం వెళుతుంది అనుకుంటే నిన్న బిగ్ బాస్ షో కి వచ్చిన విజయ్ దేవరకొండ ఆమె మరో రెండు మూడు రోజుల్లో హైదరాబాద్ రాబోతుందని కామెంట్ చేసి షాక్ ఇచ్చాడు.
Devil: కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ కోసం 80 భారీ సెట్స్.. అన్ని కోట్లు ఖర్చు పెట్టారా?
అది నిజం కాకపోవచ్చు అని అందరూ అనుకున్నారు కానీ ఆమె ఇప్పటికే హైదరాబాద్ లో ల్యాండ్ అయింది అని తెలుస్తోంది. దీంతో అసలు ఆమె అమెరికా చికిత్స తీసుకునేందుకు వెళ్లిందా లేక ఖుషి సినిమాని ప్రమోట్ చేసేందుకు వెళ్లిందా అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఒకానొక దశలో ఖుషి సినిమాని గాలికి వదిలేసి అమెరికా వెళ్లి ఫోటోషూట్లు చేస్తుందని కూడా కామెంట్లు వినిపించాయి. కానీ ఆమె అక్కడికి వెళ్లి ఖుషి సినిమాని ప్రమోట్ చేయడమే కాక చిన్న పాటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా పాల్గొంది. ఇప్పుడు కూడా చికిత్స సంగతి పక్కన పెట్టి మళ్ళీ వెనక్కి వచ్చి సినిమాని ప్రమోట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చినట్లుగా చెబుతున్నారు. అయితే ఆమె ఇంత త్వరగా హైదరాబాద్ వచ్చేందుకు మరో కారణం కూడా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె మేనేజర్ ఈ మధ్యకాలంలో కోటి రూపాయల విషయంలో మోసం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ విషయం మీద కూడా మేనేజర్ తో మాట్లాడి ఒక క్లారిటీ తీసుకునేందుకు ఆమె ఇంత త్వరగా హైదరాబాద్ వచ్చినట్లు చెబుతున్నారు.