హీరోయిన్లు ప్రేమలో పడటం కామన్.. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య లు కూడా ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారు.. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ప్రేమలో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న అమ్మడు తానే స్వయంగా చెప్పింది. దాంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా?.. ఆమె మరెవ్వరో కాదండి.. హీరోయిన్ శ్రీదివ్య..
చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన శ్రీదివ్య తెలుగమ్మాయి. కానీ టాలీవుడ్‌లో మారుతి దర్శకత్వం వహించిన ‘బస్టాప్’, ‘కేరింత’ సినిమాల్లో మాత్రమే తెలుగులో నటించింది. ఆపై తమిళ సినిమాలే చేస్తూ అక్కడ సెటిలైపోయింది. శివకార్తికేయన్ ‘వరుత్తపడాద వాలిబర్ సంఘం’ అనే మూవీతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం సక్సెస్ కావడంతో ఈమెకి వరసపెట్టి ఛాన్సులు వచ్చాయి. అలా ‘కాక్కీ సట్టై’, ‘జీవా’, ‘ఈటీ’, ‘మరుదు’, ‘బెంగుళూర్ నాట్కల్’, ‘పెన్సిల్’ వంటి పలు చిత్రాల్లో నటించింది..
ప్రస్తుతం విక్రమ్ ప్రభు ‘రైడ్’ సినిమాలో హీరోయిన్‌గా చేసింది. ఇది త్వరలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్‌లో శ్రీదివ్యని ప్రేమ, పెళ్లి గురించి రిపోర్టర్ ప్రశ్నించాడు.. దానికి సమాధానం చెప్పిన అమ్మడు త్వరలోనే పెళ్లి చేసుకుంటాను. ప్రేమ వివాహమే చేసుకుంటాను. అదీ నా ప్రియుడినే పెళ్లి చేసుకుంటాను’ అని చెప్పింది. దీంతో ఎవరా అబ్బాయి?, ఎప్పుడూ పెళ్లి చేసుకుంటుంది.. ఎక్కడ చేసుకుంటుంది అంటూ జనాలు సోషక్ మీడియాలో తెగ చర్చిస్తున్నారు.. మరి ఎప్పుడు ఈ అమ్మడు ఆ గుడ్ న్యూస్ ను చెబుతుందో చూడాలి..