Sri Ranga Neethulu Teaser:యువతరం భావోద్వేగాలతో, సినిమాలోని పాత్రలతో తమను తాము ఐడెంటిఫై చేసుకునే కథలతో, సహజంగా సాగే మాటలు, మనసుకు హత్తుకునే సన్నివేశాలతో వచ్చే సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. సరిగ్గా అలాంటి సినిమానే శ్రీరంగనీతులు అంటున్నారు మేకర్స్. ఈ సినిమా టీజర్ చూసిన ప్రతి ఒక్కరికి తప్పకుండా ఇదే ఫీల్ కలుగుతుందని వెల్లడించారు. ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి ఆహ్లాదకరమైన పాత్ర చెప్పే మాటలతో ప్రారంభమై టీజర్ ఎంతో నేచురల్‌గా అనిపించే సంభాషణలతో, సన్నివేశాలతో ఆద్యంతం ఆకట్టుకునే విధంగా కొనసాగుతుంది. విభిన్నమైన పాత్రలతో, వైవిధ్యమైన సినిమాలతో సినిమాలు చేస్తూ వైవిధ్యమైన సినిమాలతో తమకంటూ ఓ గుర్తింపును క్రియేట్ చేసుకున్న సుహాస్, కార్తీక్‌రత్నం, రుహానిశర్మ, విరాజ్ అశ్విన్ కీలక పాత్రల్లో రూపొందుతున్న సినిమా శ్రీ రంగనీతులు. ప్రవీణ్ కుమార్ వీఎస్ఎస్ దర్శకుడు.
Bhimaa Teaser: రాక్షసులను వేటాడే బ్రహ్మ రాక్షసుడు వచ్చాడురా..
రాధావి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మిస్తున్న ఈ సినిమా షూట్ పూర్తిచేసుకుని ప్రమోషన్ కార్యక్రమాలకు ఇటీవల నూతన సంవత్సరం సందర్భంగా శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది సినిమా యూనిట్. ఈ సందర్భంగా దర్శకుడు సినీ విశేషాలను తెలియచేస్తూ ఈ తరం యువత వారి ఆలోచనలను, వారి ఎమోషన్స్‌ను ఏ విధంగా వుంటున్నాయి అనేది ఈ సినిమాలో ఉండే పాత్రల ద్వారా చూపిస్తున్నామని అన్నారు. సినిమాలో వుండే ఆసక్తికరమైన కథ, కథనాలను ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూనే మనసుకు హత్తుకుంటాయని,కొత్తదనంతో పాటు పూర్తి కమర్షియల్ అంశాలతో రూపొందించిన సినిమా ఇది అని అన్నారు. నిర్మాత మాట్లాడుతూ నేటి యువత ఆలోచనలు, కుటుంబ బంధాలు..ఎంటర్‌టైన్‌మెంట్ ఇలా అన్ని అంశాల కలయికతో దర్శకుడు అందర్ని అలరించే విధంగా తెరకెక్కించాడన్నారు ఈ చిత్రానికి డీఓపీ: టీజో టామీ కాగా సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్ అందిస్తున్నారు.