JR NTR : జూనియర్ ఎన్టీఆర్ పెద్ద ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. దేవర మూవీతో మంచి హిట్ అందుకున్న ఆయన.. ఇప్పుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో భారీ సినిమా చేస్తున్నాడు. డ్రాగన్ అనే పేరు పరిశీలనలో ఉంది. ప్రస్తుతానికి షూటింగ్ జరుగుతోంది. తర్వత దేవర-2, ఆ తర్వాత నెల్సన్ తో మూవీ ఉండొచ్చు. ఎన్టీఆర్ అంటే నటనకు మారుపేరు. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోవడం ఆయనకు చాలా సులువు. ఎన్టీఆర్ నటనను ఎంతో మంది డైరెక్టర్లు మెచ్చుకున్నారు. ఇప్పటికే ఎన్నో వైవిధ్య భరితమైన పాత్రల్లో నటించి మెప్పించాడు ఎన్టీఆర్. అలాంటి నటన కనబరిచే ఎన్టీఆర్ డ్రీమ్ రోల్ ఏంటో చాలా మందికి తెలియదు.
Read Also :Techie Suicide: పని ఒత్తిడితో బెంగళూరులో టెక్కీ ఆత్మహత్య.. స్పందించిన ఓలా!
ఎన్టీఆర్ కు ఉన్న ఒకే ఒక్క డ్రీమ్ రోల్ మహాభారతంలో కృష్ణుడి పాత్ర చేయడం. ఆ విషయంలో గతంలో కూడా బయటపెట్టాడు ఎన్టీఆర్. దర్శక ధీరుడు రాజమౌళి మహాభారతం సినిమాను తీస్తానని గతంలోనే ప్రకటించాడు. కాకపోతే దానికి చాలా సమయం పడుతుందన్నాడు. ఒకవేళ జక్కన్న ఈ మూవీ తీస్తే అందులో ఎన్టీఆర్ డ్రీమ్ రోల్ లో నటిస్తాడేమో చూడాలి. ప్రస్తుతానికి ప్రశాంత్ నీల్ సినిమాతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు జూనియర్. మొన్ననే త్రిబుల్ ఆర్ కాన్సర్ట్ లో పాల్గొని వచ్చాడు. ఇప్పుడు కర్ణాటకలో డ్రాగన్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.
Read Also : Bharat : నటుడు మాస్టర్ భరత్ తల్లి కన్నుమూత..