Bharat : నటుడు మాస్టర్ భరత్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి కమలహాసిని ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో చెన్నైలో కన్నుమూశారు. గుండెపోటుతో ఆమె చెన్నైలోని ఇంట్లోనే మరణించారు. ఈ ఘటనతో భరత్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటనతో భరత్ కు సినీ నటులు, హీరోలు, డైరెక్టర్లు ఫోన్ చేసి ధైర్యం చెప్తున్నారు. టాలీవుడ్ నుంచి ఇప్పటికే కొందరు సినీ ప్రముఖులు చెన్నై బయలుదేరినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటి వరకు భరత్ అధికారికంగా ఏదీ ప్రకటించలేదు.
Read Also : Trivikram Srinivas : ఓజీ సెట్స్ లో త్రివిక్రమ్..?
కానీ ఆయన తల్లి మరణానికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. తల్లి శవ పేటిక వద్ద భరత్ తీవ్ర మనో వేదనతో నిల్చున్న ఫొటోలు ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. కమలహాసిని ప్రోత్సాహంతోనే చిన్నతనంలోనే భరత్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. భరత్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు.
Read Also : Nara Rohit : బాబాయ్.. ఏదేమైనా నీకు తోడుగా ఉంటా.. మనోజ్ పై నారా రోహిత్..