Sri Bharath Intresting Reply to JR NTR Wishes: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలుపొందిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకి జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ట్రీట్ చేసిన సంగతి తెలిసిందే. కేవలం చంద్రబాబు నాయుడుకే పరిమితం కాకుండా ఆయన తమ కుటుంబ సభ్యులుగా ఉన్న నందమూరి బాలకృష్ణ ఆయన పెద్దలుడు లోకేష్ చిన్నల్లుడు భరత్ తన అత్త పురందరేశ్వరి గెలుపులకు సంబంధించి వారందరికీ శుభాకాంక్షలు తెలిపారుప్రియమైన చంద్రబాబు నాయుడు మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను.
Actress Asritha: యాక్సిడెంట్లో గతం మర్చిపోయిన నటి.. 10% మాత్రమే బతికే ఛాన్స్.. కానీ?
అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచిన శ్రీ భరత్ కి, పురంధేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు అని అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. థాంక్ యూ తారక్ అన్న. రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు మేమందరం కృతనిశ్చయంతో ఉన్నాం. “దేవర” సినిమాతో మీకు మంచి విజయం వస్తుంది అని కోరుకుంటున్నాను అని అంటూ బాలకృష్ణ చిన్నల్లుడు ట్వీట్ చేశారు. ఇక నారా లోకేష్ థాంక్యూ సో మచ్ డియర్ తారక్ అని ట్వీట్ చేశారు. ఇక చాలా రోజులుగా టీడీపీకి తారక్ కి మధ్య దూరం ఉందనే ప్రచారాల నేపథ్యంలో తారక్ ఇలా స్పందించడం టీడీపీ క్యాడర్ కి కాస్త ఊపు ఇచ్చే అంశమే.