Sreemukhi: సీరియల్ హీరోతో శ్రీముఖి ప్రేమాయణం.. స్టేజిమీదే ప్రపోజ్.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sreemukhi: బుల్లితెర యాంకర్ సుమ తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న యాంకర్ శ్రీముఖి. తనదైన మాటలతో, డాన్స్ తో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంది. ఒకపక్క షోస్ చేస్తూనే ఇంకొపక్క సినిమాలు కూడా చేస్తూ మెప్పిస్తుంది. ఇక ప్రస్తుతం అన్ని ఛానల్స్ లో శ్రీముఖినే కనిపిస్తుంది. ఇక సోషల్ మీడియాలో అమ్మడు అందాల ఆరబోత అంతా ఇంతా కాదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఇక ఈ మధ్య ఎక్కడ చూసినా అమ్మడి పెళ్లి గురించే ప్రస్తావన నడుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే తనకు ఇప్పటికే బ్రేకప్ అయ్యిందని ఆమె చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. ఇక ఈ చిన్నది షోస్ లలో ఎంత అల్లరి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ప్రస్తుతం శ్రీముఖి యాంకర్ గా చేస్తున్న షోస్ లలో ఆదివారం మా పరివారం ఒకటి. ఇందులో ప్రతివారం సీరియల్ నటీనటులను పిలిచి.. రెండు జట్టులుగా విడదీసి గేమ్స్ ఆడిస్తారు. ముక్కు అవినాష్, హరి.. తమ పంచ్ లతో నవ్విస్తూ ఉంటారు. ఇక ఈసారి ఈ షో లో గుండె నిండా గుడిగంటలు, వంటలక్క సీరియల్స్ నటీనటులు వచ్చారు. గుండె నిండా గుడిగంటలు హీరో బాలు(విష్ణుకాంత్) వచ్చిన ప్రతిసారి శ్రీముఖి మెలికలు తిరిగిపోతూ ఉంటుంది. ఇక ఈసారి కూడా బాలుతో శ్రీముఖి రచ్చ రచ్చ చేసింది. బాలును తన ప్రేమతో ఉక్కిరి బిక్కిరి చేసింది. ఇన్నాళ్లు రాలేదు ఏంటి అని అలిగింది. ఇక అతనికి తెలుగు రాకపోవడంతో.. శ్రీముఖికి ఏం చెప్పాలో తెలియని సందిగ్ద పరిస్థితిలో కనిపించాడు. చివరికి బాలు చేత అక్షరాభ్యాసం చేయిస్తూ.. శ్రీముఖి ఐ లవ్ యూ అంటూ ప్రపోజ్ చేయించింది. ఇదంతా సరదాకే అయినా కూడా.. ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంది పెళ్లి చేసుకోండి అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
Also Read
- Nagarjuna: భట్టి మాటలతో ఆలోచనలో పడి పళ్ళ బురుసు సినిమా చేశాం
- RGV నుంచి సంచలన సినిమా.. T-Series నిర్మాణంలో ‘పోలీస్ కంపెనీ’!
- Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
- Ranabaali: రణబాలి రిలీజ్‌పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!