Srileela Trolling : శ్రీలీలకు అవమానం.. లెనిన్ నుండి తప్పుకోవడం ప్లస్ అంటూ ట్రోలింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో ఒకప్పుడు పొగిడిన నోళ్లే ఇప్పుడు శ్రీలీలను ఐరన్ లెగ్, బ్యాడ్ లక్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ హీరోలందరికీ శ్రీలీలనే కావాలి. లీల కాల్షీట్స్ కోసం క్యూ కట్టినవాళ్లే. లీల డ్యాన్స్ అండ్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్‌కు కుర్రకారు ఫిదా అయిపోయారు. కానీ వరుస ఫ్లాప్స్ వైరల్ వయ్యారీ ఇమేజ్ డ్యామేజ్ చేశాయి. అంతే కాదు ఏదైనా సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా తీసుకున్నారు అనగానే ఆ సినిమా డిజాస్టరేనన్న ఓపెన్ కామెంట్స్ వచ్చేవి. తాజాగా లెనిన్ వల్ల మరోసారి ట్రోల్ అవుతోంది శ్రీలీల.
లెనిన్ తాజాగా రిలీజై మంచి టాక్‌తో దూసుకెళుతోంది. అఖిల్ నటనతో పాటు భాగ్యశ్రీ బోర్సే యాక్టింగ్‌ను పొగిడేస్తున్నారు ఆడియన్స్. అక్కడ వరకు ఆగకుండా ఈ మూవీ నుండి శ్రీలీల తప్పుకోవడంపై హ్యాపీని వ్యక్తం చేస్తున్నారు. లీల ఉంటే సినిమా షెడ్డుకు వెళ్లిపోయేదన్న కామెంట్స్ చేస్తున్నారు రివ్యూయర్స్. కిస్సిక్ బ్యూటీ డేట్స్ ఇష్యూ వల్ల సినిమా నుండి తప్పుకోవడం మంచిదయ్యిందటూ ట్రోల్స్ చేస్తున్నారు. రీసెంట్లీ ప్రొడ్యూసర్ సైతం లీలను బ్యాడ్ అంటూనే కవర్ చేసే ప్రయత్నం చేశాడు. ప్రజెంట్ శ్రీలీల టాలీవుడ్లో నెగిటివిటీని మూటగట్టుకుంది. డ్యాన్స్ తప్ప మరోటి రాదన్న కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఆమె కెరీర్‌పై గట్టిప్రభావాన్నేచూపిస్తుంది. వీటికి తోడు ఐరన్ లెగ్, బ్యాడ్ లక్ ట్యాగ్స్ ఆమెను టాలీవుడ్‌కు దూరం చేస్తున్నాయి. ఇక్కడి హీరోస్, మేకర్స్ పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్లో సినిమాలు చేస్తోన్న లీల అక్కడ హిట్ కొట్టి తనపై పడిన మరకను చెరిపేసుకుని మళ్లీ గోల్డెన్ లేడీ అనిపించుకుంటుందేమో చూడాలి.
Also Read
- Sudha Kongara: రూ.8.39 కోట్ల పారితోషిక వివాదం.. సుధా కొంగరకు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ
- Dhanush: ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా తర్వాత మరో సంచలనం!.. అదే దేవుడిపై ధనుష్ కొత్త ప్రాజెక్ట్
- Tollywood: షాక్ ఫ్యాక్టర్లు లీక్ ఫ్యాక్టర్లవుతుంటే ఎలా?
- Gudluri Ashok Babu: హీరోగా అవకాశం ఇస్తానంటూ రూ.3.5 కోట్ల మోసం.. 'భాగమతి' డైరెక్టర్‌పై కేసు నమోదు!
తాజావార్తలు
-
Srileela Trolling : శ్రీలీలకు అవమానం.. లెనిన్ నుండి తప్పుకోవడం ప్లస్ అంటూ ట్రోలింగ్
-
ASUS Vivobook 14: ఆసుస్ వివో బుక్ 14, 15 భారత్‌లో లాంచ్.. Intel AI ప్రాసెసర్, 17 TOPS NPU, DDR5 RAM
-
FIFA World Cup 2026: మెరినో మ్యాజిక్.. బెల్జియంపై 2-1 థ్రిల్లర్ విజయంతో సెమీస్‌లోకి స్పెయిన్.!
-
Sudha Kongara: రూ.8.39 కోట్ల పారితోషిక వివాదం.. సుధా కొంగరకు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ
-
Yamaha FZ Flex Fuel: యమహా FZ Flex Fuel బైక్ విడుదల.. ఇప్పుడు E85 ఇంధనంతోనూ పరుగులు.. ధర, ఫీచర్లు ఇవే
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!