Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhanush Secret: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ఓం’ (O.M). రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ ఈవెంట్లో భాగంగా యాంకర్ ‘ది క్లాసిఫైడ్ మిషన్ ఫైల్’ పేరుతో హీరోయిన్లను సరదా ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలోనే ధనుష్ గురించి ప్రపంచానికి తెలియని ఒక సీక్రెట్ చెప్పాలని శ్రీలీలను అడగ్గా, ఆమె బయటపెట్టిన విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఈ సినిమాలో టాస్క్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ధనుష్‌కు భార్య (రోజా)గా శ్రీలీల కనిపించనుంది. “మీరు ధనుష్ గారికి ఫ్యామిలీ ఫ్రెండ్ కదా.. బయటి ప్రపంచానికి తెలియని ఆయన సీక్రెట్ ఏదైనా ఒకటి మాతో పంచుకోండి” అని యాంకర్ అడిగారు. దీనికి శ్రీలీల బదులిస్తూ.. “ఇది ఆయన దగ్గరగా ఉన్నప్పుడే మనకు తెలిసే ఒక ప్రత్యేక అనుభూతి. ఆయన పక్కన నుంచి నడుస్తూ వెళ్తుంటే ఒక రకమైన విభూతి వాసన (సువాసన) వస్తూ ఉంటుంది. చెన్నైలో జరిగిన ఈవెంట్లో ఈ విషయం చెప్పాను కానీ, మన తెలుగు వాళ్లకు చెప్పలేదు కాబట్టి ఇక్కడ మళ్లీ చెబుతున్నాను” అంటూ ధనుష్‌లో ఉన్న ఆధ్యాత్మిక కోణాన్ని, ఆయన ప్రత్యేకతను శ్రీలీల అందరి ముందు లీక్ చేసింది. ఇక ఆన్-స్క్రీన్ భర్తగా ధనుష్‌కు ఏదైనా సలహా ఇస్తారా అని అడగ్గా.. ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది కదా, కాస్త ఇంట్లో కూడా ఎక్కువ సమయం గడపమని రోజా అడుగుతోందని నవ్వుతూ చెప్పింది.
Also Read
- OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
- Renu Desai: 'ఓం' ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్‌కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
- Janta Movie: మెగా హీరో 'జంట' సెన్సేషనల్ క్యాప్షన్ వెనుక అసలు కథ ఇదే!!
- Love Story: అనిరుధ్ మామ కళానిధి మారన్ ప్రేమ కథ తెలుసా?
మరోవైపు, ఈ సినిమాలో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ‘నిత్య రెడ్డి’గా కనిపించనున్న సాయి పల్లవి కూడా యాంకర్ ప్రశ్నలకు భలే సమాధానాలు ఇచ్చింది. చెన్నై ప్రీ-రిలీజ్ ఈవెంట్లో మమ్ముట్టి మిమ్మల్ని ‘సాయి పల్లవి మేడం’ అని పిలిచారు కదా, ఆ సమయంలో మీ రియాక్షన్ ఏంటి అని అడగ్గా.. “అది ఆయన పెద్దరికం. కానీ ఆయన మనసులో ఇంకా తాను చాలా చిన్న పిల్లాడినని, నేనేదో పెద్దదాన్ని అని అనుకుంటున్నారు. సెట్లో కూడా ఆయన అందరితో జోకులు వేస్తూ చిన్న పిల్లాడిలాగే సరదాగా ఉంటారు. అందుకే నన్ను మేడం అని పిలిచారు” అంటూ నవ్వులు పూయించింది. ఇక గతంలో ‘మారి 2’లో ధనుష్, సాయి పల్లవి కలిసి చేసిన ‘రౌడీ బేబీ’ లాంటి మాస్ డ్యాన్సులు ఈ సినిమాలో ఉంటాయా అని అడగ్గా.. “కథ చెప్పినప్పుడే దర్శకుడు రాజ్‌కుమార్ గారు ‘పల్లవి, ఇందులో ధనుష్ సార్‌తో నీకు ఎలాంటి డ్యాన్సులు ఉండవు’ అని ముందే చెప్పేశారు” అంటూ సాయి పల్లవి స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
-
OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
-
Renu Desai: ‘ఓం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్‌కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఊరట..
-
Janta Movie: మెగా హీరో ‘జంట’ సెన్సేషనల్ క్యాప్షన్ వెనుక అసలు కథ ఇదే!!
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!